విధి వంచించినా మానవత్వంతో ఆదుకున్న సభాపతి..

by Disha Web Desk 20 |
విధి వంచించినా మానవత్వంతో ఆదుకున్న సభాపతి..
X

దిశ, బాన్సువాడ : పేదమైనారిటీ కుటుంబానికి పోచారం అండగా నిలిచారు. శనివారం రుద్రూరు, వర్ని మండలాల్లో కార్యక్రమాలు ముగించుకుని బాన్సువాడకు వెళ్ళుతున్న తెలంగాణ రాష్ట్రశాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, వర్ని మండలం ఎస్ఎన్ పురం గ్రామపంచాయతీ రజాకాలనీలో నూతనంగా నిర్మిస్తున్న మైనారిటీ కమ్యునిటీ హాల్ ను పరిశీలించడానికి ఆగారు. అదే సమయంలో రోడ్డుకు ఎదురుగా ఉన్న ఇంటి ముందు టెంట్ వేసి జనాలు ఉండడంతో ఏమైందని స్థానికులను అడగగా వారు స్థానికుడైన ఖాసీం భార్య బిడ్డకు జన్మనిచ్చి మరణించిందని తెలిపారు. రజాకాలనీలో నివసించే ఖాసీం ది పేద కుటుంబం వారు కూలీ చేసుకుని జీవిస్తున్నారు. ఖాసీం భార్య ఫౌజీయా పర్వీన్ రెండవ సారి ప్రసవం అయి బాబుకు జన్మనిచ్చి శుక్రవారం అనారోగ్యంతో మరణించింది.

విషయం తెలుసుకున్న స్పీకర్ పోచారం మృతురాలి ఇంటికి వెళ్ళి ఖాసీంను, వారికుటుంబ సభ్యులను కలిసి ఓదార్చారు. జరిగిన సంఘటనను తెలుసుకున్న స్పీకర్ పోచారం పుట్టుకతోనే తల్లిని కోల్పోయిన పసికందును ఎత్తుకుని చలించిపోయారు. జరిగిన సంఘటన దురదృష్టకరం అని, దేవుడు ఆ పసికందుకు అన్యాయం చేసాడని బాధపడ్డారు. చనిపోయిన పసికందుకు తల్లి ప్రేమను తేలేకపోయినా వ్యక్తిగతంగా వారి బాధను పంచుకుంటానని అన్నారు. తక్షణమే బాబు పోషణకు, ఇతర ఖర్చులకు స్వంతంగా 50,000 రూపాయలను అందించారు. బాబుతో పాటుగా మొదటి సంతానం పాపను జాగ్రత్తగా చూసుకోవాలని పిల్లల నానమ్మకు సూచించారు. ఖాసీంకు రేకుల ఇల్లు ఉండడంతో తక్షణమే డబుల్ బెడ్ రూం ఇళ్ళును మంజూరు చేశారు.

గతంలో డబుల్ బెడ్ రూం ఇళ్ళు మంజూరు అయిందని, కానీ కట్టుకునే స్థోమత లేక నిర్మించుకోలేదని ఖాసీం స్పీకర్ కి తెలిపారు. ఖాసీం పరిస్థితి చూసిన స్పీకర్ పోచారం తనకుమారుడు పోచారం సురేందర్ రెడ్డి ద్వారా డబుల్ బెడ్ రూం ఇల్లు నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా ఖాసీం అత్త, మృతురాలు ఫౌజీయా పర్వీన్ తల్లికి కూడా స్వంతఇల్లు లేదని తెలుసుకున్న స్పీకర్ పోచారం ఆమె స్వగ్రామం రుద్రూరులో నూతనంగా నిర్మిస్తున్న 150 ఇళ్ళ డబుల్ బెడ్ రూం కాలనీలో ఒక ఇంటిని కెటాయిస్తున్నట్లు తెలిపారు. విధి చిన్ చూపుచూసి తమ కుటుంబానికి అన్యాయం చేసినా‌, పోచారం శ్రీనివాస రెడ్డి దేవునిలా తమ ఇంటికి వచ్చి తమకు అన్నివిధాలుగా అండగా నిలిచాడని ఖాసీం కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఖాసీం కుటుంబానికి సహాయం చేయడంపై గ్రామస్తులు స్పీకర్ పోచారంకు ధన్యవాదాలు తెలిపారు.


Next Story

Most Viewed