ప్రజా తీర్పును గౌరవిస్తా

by Disha Web Desk 15 |
ప్రజా తీర్పును గౌరవిస్తా
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నానని, గెలుపు ఓటములు సహజమని నిజామాబాద్ అర్బన్ తాజా మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా అన్నారు. బుధవారం బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ... ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజా తీర్పును గౌరవిస్తున్నా అని అన్నారు. తొమ్మిదిన్నర సంవత్సరాలు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గా నగర ప్రజలు తనకు అవకాశం కల్పించారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ఎక్కువ సమయం నిజామాబాద్ నగర అభివృద్ధి పనులకు కేటాయించాను అని గుర్తు చేశారు. నూతన సమీకృత కలెక్టర్ కార్యాలయం, ఐటీ హబ్, మినీ ట్యాంక్ బండ్, రైల్వే వంతెన, వైకుంఠ ధామాలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, డివైడర్ లు, అందమైన లైట్లు నిర్మాణం చేశానని తెలిపారు.

కుల సంఘాలను గౌరవిస్తూ కుల మతాలకు అతీతంగా రూ.కోట్లతో భవనాల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేశానన్నారు. కరోనా విపత్కర సమయంలో, భారీ వర్షాలు కురిసినప్పుడు వారికి అండగా ఉంటూ ఉచితంగా భోజనం అందించానన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి అని కోరారు. 2009 లో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయినా కూడా ప్రజలకు,కార్యకర్తలకు అందుబాటులో ఉన్నట్టు తెలిపారు. ఇక ముందు కూడా ప్రజలతో ఉంటూ వారికష్ట సుఖాలలో భాగస్వామిని అవుతానన్నారు. సేవ చేయాలనే సంకల్పం ముందు ఎటువంటి పదవి అవసరం లేదని, నిజామాబాద్ ప్రజలకు ఎటువంటి ఆపద వచ్చినా అండగా ఉంటాను అని తెలిపారు. కార్యక్రమంలో మేయర్ దండు నీతు కిరణ్ ,రెడ్కో మాజీ చైర్మన్ అలీం, నుడ మాజీ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు మీర్ మాజాజ్ అలీ, నవీద్ ఇక్బల్, సుజిత్ సింగ్ ఠాకూర్, సత్య ప్రకాష్, సిర్ప రాజు, యెనుగందుల మురళి, రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.Next Story

Most Viewed