రాస్తా రోకోలు.. ధర్నాలు ఫలించేనా..!

by Disha Web Desk 20 |
రాస్తా రోకోలు.. ధర్నాలు ఫలించేనా..!
X

దిశ, గాంధారి : ఉమ్మడి నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలో గాంధారి మండలానికి ఓ ప్రత్యేకత ఉంది. అదేంటంటే ఉమ్మడి జిల్లాలో అత్యంత ఖరీదైన భూముల విలువ ఇక్కడ తప్ప ఎక్కడ ఉన్న దాఖలాలు లేవు. అయితే ఇంత ప్రత్యేకత ఉన్నా గాంధారి మండలానికి డిగ్రీ కళాశాల మంజూరు చేయాలని నిరసిస్తూ విద్యార్థి సంఘాలు, రాజకీయ నాయకులు, స్థానిక ప్రజలు స్వచ్ఛందంగా ధర్నాలు ర్యాలీలు నిర్వహించారు. అయితే అప్పట్లో ఎల్లారెడ్డి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్న ఏనుగు రవీందర్ రెడ్డి నేను సీఎం దృష్టికి తీసుకెళ్తాను, తప్పకుండా గాంధారికి డిగ్రీ కళాశాలను మంజూరు చేయిస్తానని మాట ఇచ్చారు. అలాగే ఇప్పడు ఎల్లారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న జాజాల సురేందర్ కు కూడా ఎన్నోసార్లు విద్యార్థి సంఘాల నేతలు, ప్రజాప్రతినిధులు ఆయన దృష్టికి తీసుకెళ్లిన తప్పకుండా మంజూరు అవుతుందని మాట ఇచ్చారు.

గాంధారి మండల ప్రజలు డిగ్రీ చదవాలంటే గాంధారి నుండి కామారెడ్డి వెళ్లాల్సిందే గాంధారి మండల విద్యార్థులు డిగ్రీ చదువుకోవాలనుకుంటే నిత్యం 30 కిలోమీటర్లు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. గాంధారి మండల కేంద్రంలోని 34 గ్రామపంచాయతీలో ఉన్న మండల కేంద్రానికి విద్యార్థులు చేరుకునేందుకు అదనంగా ఇంకో పది కిలోమీటర్లు గాంధారి వరకు నెట్టుకు రావాల్సిందే.గాంధారి మండల చుట్టుపక్కల గ్రామాల విద్యార్థులు ఇంటర్ పూర్తి కాగానే ఇంటికే పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. విద్యార్థులకు ఇచ్చిన వాగ్దానాలు అదేవిధంగా నాయకులు ఇచ్చిన వినతి పత్రాలు సమర్పించిన అవి కాగితాలకే పరిమితం అయ్యాయని విద్యార్థి సంఘ నాయకులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా జాప్యం వహించకుండా డిగ్రీ కళాశాల మంజూరు చేయాలని టి ఎస్ ఎఫ్ గాంధారి మండల అధ్యక్షులు నితిన్ కుమార్ పాటిల్, బిజెపి మండల కార్యదర్శి జువ్వడి శ్రీకాంత్ తెలిపారు. డిగ్రీ కళాశాల విషయంలో జరిగితే మరోసారి ధర్నాలు తప్పవని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.


Next Story

Most Viewed