ఆర్మూర్లో పల్సర్ బైక్ చోరీ

by Disha Web Desk 15 |
ఆర్మూర్లో  పల్సర్ బైక్ చోరీ
X

దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ మున్సిపల్ కేంద్రంలో గల కోటర్మూర్ ఏరియాలో పిట్టల చందు కు చెందిన బజాజ్ పల్సర్ బైక్ శుక్రవారం తెల్లవారుజామున చోరీకి గురైంది. ఇంటి వద్ద నిలిపి ఉంచిన బైకును గుర్తు తెలియని దుండగులు చోరీ చేసి ఎత్తుకెళ్లినట్లు బాధిత కుటుంబ సభ్యులు వాపోయారు. చోరీకి గురైన పల్సర్ బైక్ విషయాన్ని ఆర్మూర్ పోలీస్ స్టేషన్ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు వారు చెప్పారు. ఆర్మూర్ ప్రాంతంలో ఎక్కడైనా ఈ నెంబర్ గల పల్సర్ బైక్ కనిపిస్తే ఇన్ఫర్మేషన్ ను ఈ క్రింది 9603111944,9553664455 సమాచారం ఇవ్వాలని బాధితుడు కోరాడు.

Next Story