రోడ్డు ప్రమాదాలపై ప్రజలకు అవగాహన

by Disha Web Desk 20 |
రోడ్డు ప్రమాదాలపై ప్రజలకు అవగాహన
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : వరల్డ్ ట్రామా డేను పురస్కరించుకొని ట్రాఫిక్ పోలీస్, మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తాలోని ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద రోడ్డు యాక్సిడెంట్లపై ప్రజల్లో అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. అత్యవసర సమయంలో వైద్య సహాయం అవసరమయ్యే రోగులకు సత్వరం ప్రధమ చికిత్స ఎలా అందించాలో మెడికవర్ హాస్పిటల్స్, అత్యవసర విభాగం డాక్టర్లు ప్రజలకు అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ట్రాఫిక్ సీఐ చందర్ రాథోడ్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల్లో మరణించే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయన్నారు. మితిమీరిన వేగం, హెల్మెట్ లేకపోవడం, సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం వంటి కారణాలతో చాల మంది రోడ్డు ప్రమాదాల్లో వారి ప్రాణాలను అర్దాంతరంగా పోగొట్టుకుంటున్నారని అన్నారు. 90 శాతం మరణాలకు సరైన భద్రత ప్రమాణాలు పాటించకపోవడమే ప్రధాన కారణమని, ప్రతి ఒక్కరి జీవితం చాలా విలువైనది, ప్రతి ఒక్కరు సరైన భద్రతా ప్రమాణాలు పాటించి ఇతరులకు అవగాహనా కల్పించాలని అన్నారు.

అనంతరం ఆసుపత్రి అత్యవసర వైద్య విభాగం అధిపతి డాక్టర్ సందీప్ మాట్లాడుతూ దేశంలో రోడ్డు ప్రమాదాల కారణంగా అత్యధిక సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయన్నారు. ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన కల్పించడం కోసమే వరల్డ్ ట్రామాడే నిర్వహిస్తున్నామన్నారు. ప్రతిరోజూ 400 మందికి పైగా ప్రాణాలు కోల్పోతున్నట్లు అంచనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డా.రవికిరణ్, డా.వను, డా.సందీప్, డా.అరవింద్ మేనేజ్ మెంట్ శ్రీనివాస్ శర్మ, స్వామి, లహరి, నేహా వినయ్, ప్రవీణ్, సిబ్బంది పాల్గొన్నారు.

Next Story

Most Viewed