'విద్యార్థులు సమాజంలోని రుగ్మతలపై నిత్యం పోరాడాలి'

by Disha Web |
విద్యార్థులు సమాజంలోని రుగ్మతలపై నిత్యం పోరాడాలి
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: విద్యార్థులు సమాజాన్ని శోధించి సమాజంలో రుగ్మతలపై నిత్యం పోరాటాలు చేయాలని ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కాశీం విద్యార్థులకు పిలుపునిచ్చారు. పీడీఎస్‌యూ రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతుల ముగింపు సందర్భంగా గురువారం రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో నిర్వహించిన బహిరంగ సభకు ప్రోఫెసర్ కాశీం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేడు సమాజంలో అంతరాలు రోజురోజుకు విపరీతంగా పెరుగుతున్నాయన్నారు.

కుల, మత, ధనిక, పేద, స్త్రీ, పురుష అసమానతలు హెచ్చరిల్లుతున్నాయి. వీటిని పాలకవర్గాలు ప్రత్యక్షంగా పెంచి పోషిస్తున్నాయి అన్నారు. వీటి మీద ఆధారపడి తమ రాజకీయాలు గడుపుతూ తమ పాలనను పదిలం పరుచుకుంటున్నారని, ఇది నిరంతరం కొనసాగితే సమాజం ఇంకా అనాగరిక యుగంలోకి వెళుతుందని అన్నారు.

నేటి విద్యార్థి లోకం తమ విద్యారంగ సమస్యల పై నిరంతరం పోరాడుతూనే.. సమ సమాజం కోసం తమ వంతు కృషి చేయాలని, అందుకు ప్రగతిశీల విద్యార్థులుగా పీడీఎస్‌యూ నాయకత్వం సరైన పాత్ర పోషిస్తుందని ఆ వెలుగులో ముందుకు పోవాలని వారు పిలుపునిచ్చారు. ఈ బహిరంగ సభలో రాష్ట్ర అధ్యక్షులు ఎస్ నాగేశ్వరరావు అధ్యక్షత వహించగా టీపీటీఎఫ్ రాష్ట్ర మాజీ కార్యదర్శి మనోహర్ రాజు, సీఎల్‌సీ రాష్ట్ర కోశాధికారి నాలుగో రవీందర్, పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోయిన్పల్లి రాము, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సీహెచ్ కల్పన, రామకృష్ణ, స్వాతి, రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం. నరేందర్, ఆజాద్, సాయి, అనిల్ తదితరులు ప్రసంగించారు. పీడీఎస్‌యూ రాష్ర్ట రాజకీయ శిక్షణ తరగతులు ముగింపు సంధర్బంగా స్థానిక ధర్నా చౌక్ నుండి రాజీవ్ గాంధీ ఆడిటోరియం వరకు భారీ విద్యార్థి ప్రదర్శన నిర్వహించారు.

Telugu News , Latest Telugu News. Telangana News. Political News. Cinema News. Crime News. AP News. Web Stories. Latest Photo Galleries

Next Story

Most Viewed