'విద్యతోపాటు విజ్ఞానం ముఖ్యమే'

by Vinod kumar |
విద్యతోపాటు విజ్ఞానం ముఖ్యమే
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ నగరంలోని మాధవ నగర్ లో ఎస్ఎస్ఆర్ డిస్కవరీ స్కూల్ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. బుధవారం రాత్రి పాఠశాల ఆవరణలో "విద్యా దీప్' పేరెంట్స్ అన్యువల్ డే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ నాగరాజు హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల్లో విద్యాబోధన తో పాటు సృజనాత్మకతను పెంచాలని కోరారు.

పోటీ ప్రపంచంలో విద్యార్థులు సాంకేతికత అంశాలను పరిగణలోకి తీసుకొని భవిష్యత్తు విద్యను అభ్యసించాలని ఆకాంక్షించారు. టెక్నికల్ ఎడ్యుకేషన్ కు భవిష్యత్తు ఉందని దానితోపాటు విద్యార్థులు సమాజం పట్ల అవగాహన కలిగి ఉండాలని కోరారు. విద్యార్థులను తల్లిదండ్రులు సెల్ ఫోన్లకు దూరంగా ఉంచాలని కోరారు విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయులపై ఎంత ఆధారపడి ఉందో తల్లిదండ్రుల నడవడిక పైన కూడా అదే స్థాయిలో బాధ్యత ఉందని అన్నారు.


విద్యతోపాటు విజ్ఞానం ముఖ్యమైన అని దాని పరిగణలోకి తీసుకొని విద్యార్థులకు విద్యాబోధన జరగాలని సూచించారు . ఈ సందర్భంగా ఎస్ఎస్ఆర్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ మారయ్య గౌడ్ మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దరమే ఎస్ఎస్ఆర్ విద్యాసంస్థల లక్ష్యమని అన్నారు విద్యార్థుల తల్లిదండ్రులు సహకరిస్తే విద్యార్థుల భవిష్యత్తు బాగా తీర్చిదిద్దుతామని అన్నారు. విద్యార్థులపై తల్లిదండ్రులకు వాత్సల్యం ప్రేమ ఉంటే సరిపోదని వారిని భవిష్యత్తును గుర్తరిగి విద్యాబోధనకు సహకరించాలని కోరారు.


ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన ప్రదర్శనలు, డాన్సులు అందర్నీ ఆకట్టుకున్నాయి విద్యార్థుల తల్లిదండ్రులతో చేయించిన డ్యాన్సులు హైలెట్గా నిలిచాయి. పాఠశాల నుంచి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వివిధ క్రీడల్లో బహుమతులు సాధించిన వారికి సన్మానించారు విద్యా దీప్ అన్యువల్ డే సందర్భంగా పెర్ఫార్మన్స్ చేసిన విద్యార్థులకు చీఫ్ గెస్ట్ ద్వారా బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ఆర్ విద్యాసంస్థల సీఈఓ లలితా మారయ్యగౌడ్ ప్రిన్సిపల్ భాస్కర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed