కన్నీటి పర్యంతమైన స్పీకర్ పోచారం.. కారణం అదేనా..!

by Disha Web Desk 1 |
కన్నీటి పర్యంతమైన స్పీకర్ పోచారం.. కారణం అదేనా..!
X

దిశ, బాన్సువాడ : కామారెడ్డి జిల్లా నసుర్లబాద్ మండలం బొమ్మన్ దేవ్ పల్లిలో శుక్రవారం జరిపిన తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా సంక్షేమ సంబురాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణలో అమలవుతోన్న సంక్షేమ పథకాలైన ఆసరా పింఛన్, డబుల్ బెడ్ రూం ఇళ్లు, రైతు బంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ను ప్రొజెక్టర్ ద్వారా ప్రజలకు ఏ.వీ రూపంలో ప్రదర్శిస్తుండగా.. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి భావోద్వేగాని గురై ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకున్నారు.

Next Story