దిశ ఎఫెక్ట్.. స్పందించిన అధికారులు

by Dishafeatures2 |
దిశ ఎఫెక్ట్.. స్పందించిన అధికారులు
X

దిశ భీమ్‌గల్: ఇటీవల దిశ పత్రికలో ప్రచురితమైన"అంగన్వాడీ కేంద్రమా…ఎలుకల ఆవాసమా" అనే వార్తకు ఎసీడీపీఓ స్వర్ణలత స్పందించారు. సెక్టర్ సూపర్వైజర్‌తో కలిసి కారేపల్లి తో పాటు మిగతా గ్రామాల అంగన్వాడి కేంద్రాలను సందర్శించారు. అంగన్వాడీ కేంద్రాల లోపల మౌలిక సదుపాయాలు,సమస్యలపై ఆ గ్రామాల సర్పంచ్‌లతో మాట్లాడారు. పీఎంఏజీవై క్రింద గ్రామానికి వచ్చిన నిధులతో అంగన్వాడీ కేంద్రాలకు మరమ్మతులు చేయిస్తామని వారు హామీ ఇచ్చారని ఎసీడీపీఓ స్వర్ణలత తెలిపారు. ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలను అధికారులకు చేరవేస్తూ,సమస్యల పరిష్కారినికి కృషిచేస్తున్న దిశ పత్రిక కు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.



Next Story