ఎమ్మెల్యే గణేష్ గుప్తకు అభివృద్ధి మీద చిత్తశుద్ధి లేదు..

by Disha Web Desk 20 |
ఎమ్మెల్యే గణేష్ గుప్తకు అభివృద్ధి మీద చిత్తశుద్ధి లేదు..
X

దిశప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ ఎమ్మెల్యే ఇంటి చుట్టూ, క్యాంప్ ఆఫీస్ చుట్టూ రోడ్లు వేసుకొని అభివృద్ధి అంటే ఇదే అని చెబుతున్నారు. అయనకు నగర అభివృద్ధి మీద చిత్తశుద్ధి లేదని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ విమర్శించారు. నిజామాబాద్ నగరంలోని బీజేపీ జిల్లాకార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సంధర్బంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ రోడ్డు మద్యలో డివైడర్ లు కట్టి చెట్లు నాటాగానే అభివృద్ధి అయినట్టేనా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే మొదటి ఐదేళ్ల పాలనలో 12 కోట్లు పెట్టి చేసిన డెవలప్ మెంట్ ఏమిటని అన్నారు. మొన్నటికి మొన్న రాష్ర్ట మున్సిపల్ మంత్రి కేటిఆర్ జిల్లా కేంద్రంలో 900 కోట్లు మాత్రమే ఇప్పటి వరకు ఖర్చపెట్టారని అన్నారు. మరి ఎమ్మెల్యే తెచ్చిన వందల కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టారన్నారు.

మిని ట్యాంక్ బండ్ ఎప్పుడు ప్రారంభిస్తారని ప్రశ్నించారు. 1100 డబుల్ బేడ్ రూంలు సాంక్షన్ ఐతే ఇప్పటి వరకు కట్టిన 300 ఎప్పుడు పెధలకు పంచుతారని అవి అప్పుడే శిథిలావస్తకు చెరాయన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజి సిస్టం ప్రజలకు ఎప్పుడు అందుబాటులో వస్తుందన్నారు. నగరం డేవలప్ మెంట్ కోసం వేసిన మాస్టర్ ప్లాన్ నాలుగు సంవత్సరాలుగా ఎందుకు అమోదించడం లేదో ప్రజలకు తెలుపాలని అన్నారు. పోలీస్ వ్యవస్థను చెక్కు చేతుల్లో పెట్టుకొని ఎమ్మెల్యే రాజకీయాలు చేయడం తగదన్నారు. అర్బన్ లో రాజకీయ పోరుకు సిద్ధమవుతున్నామన్నారు ప్రతి ఇంటి తలుపు తడతామని ప్రజలతో కలిసి ప్రభుత్వం మీద పోరాటానికి సిద్ధం అవుతున్నామన్నారు రాష్ట్రంలో కెసిఆర్ అన్ని అబద్ధాలే మాట్లాడుతున్నారన్నారు.

రేపటి నుంచి స్ట్రీట్ కార్నర్స్ మీటింగ్ కేంద్ర, ప్రతి డివిజన్ లో ప్రతిచౌరస్తా లో ప్రజలతో ఈ స్ట్రీట్ కార్నర్ మీటింగ్ నిర్వహించడం దానికి మండల అధ్యక్షులు, శక్తి కేంద్ర ఇంచార్జీలు బీఆర్ఎస్ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక పాలనను నిరసిస్తూ వారి ప్రభుత్వం చేస్తున్న అవినీతి ఆగడాలను ప్రజల ముందు ఉంచడానికి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రతిమండల, డివిజన్, శక్తి కేంద్రాలలో స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లు నిర్వహిస్తున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు నాగొల్ల లక్ష్మి నారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శులు పోతన్ కర్ లక్ష్మి నారాయణ, న్యాలం రాజు, అసెంబ్లీ కన్వీనర్ పంచరెడ్డి లింగం, కూరెళ్ళ శ్రీధర్ కో కన్వీనర్ నారాయణ యాదవ్ కార్పొరేటర్లు మాస్టర్ శంకర్, సుక్క మధు, మెట్టు విజయ్, పంచరెడ్డి శ్రీధర్, మండల అధ్యక్షులు గడ్డం రాజు తదితరులు పాల్గొన్నారు.

Also Read..

అసలైన ప్రేమ వరంగల్ తూర్పులోనే ఉంది : కొండా దంపతులు



Next Story

Most Viewed