ఆరోగ్య జ్యోతికి నేషనల్ అవార్డు ప్రధానం

by Disha Web Desk 1 |
ఆరోగ్య జ్యోతికి నేషనల్ అవార్డు ప్రధానం
X

దిశ, బాన్సువాడ : ది నేషనల్ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ది న్యూస్ పేపర్స్ అసోసియేషన్ ఆఫ్ కర్ణాటక సంయుక్తంగా మంగళవారం ఇంటర్నేషల్ నర్సస్ డే వేడుకలను బెంగళూరులోని రవీంద్ర కళక్షేత్రలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నర్సింగ్ వృత్తిలో వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి 'నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ నర్సస్ అవార్డ్-2023' ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరై ఈ అవార్డును అందజేశారు.

ఈ అవార్డుకు తెలంగాణ రాష్ట్రం బాన్సవాడ ఏరియా వైద్యశాలలో హెడ్ నర్స్ గా పని చేస్తున్న ఆరోగ్య జ్యోతి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గారి చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. ఆమె గత పాతికేళ్లుగా వైద్యశాలలో పని చేయడమే కాకుండా తన కూతురు మృతి చెందిన తరువాత ఆరోగ్య జ్యోతి చారిటబుల్ ట్రస్టు ఏర్పాటు చేసి సేవలు కొనసాగిస్తున్నారు.

జీవన శైలి వ్యాధుల నిర్ధారణకు శిబిరాలు పెడుతున్నారు. వేసవి నేపథ్యంలో ఫిబ్రరిలో శిబిరం పెట్టి 135 యూనిట్ల రక్తం సేకరించారు. కరోనా సమయంలో సరుకుల పంపిణీ, పేద విద్యార్థులకు చేయూత వంటి కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. అదేవిధంగా క్యాన్సర్ అవగాహన సదస్సులను నిర్వహిస్తున్నారు. ఆమె ఈ అవార్డుకు ఎంపికైనందుకు బాన్సవాడ ఏరియా వైద్యశాల మెడికల్ సుపరెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ ఆమెను అభినందించారు.


Next Story

Most Viewed