- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
విధుల్లో నిర్లక్ష్యాన్ని సహించేది లేదు.. మున్సిపల్ కమిషనర్

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ నగరంలోని కంటేశ్వర్, శివాజీ నగర్ ప్రాంతాల్లో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ గురువారం తెల్లవారుజామున ఆకస్మికంగా తనిఖీ చేశారు. సంబంధిత అధికారులను వెంటబెట్టుకుని ఆయన ఆయా ప్రాంతాల్లోని డ్రైనేజీలను, అక్కడ పారిశుద్ధ్య సిబ్బంది చేస్తున్న పనుల తీరును పరిశీలించారు. సిబ్బంది హాజరు పై ప్రశ్నించారు.
ఎక్కడ ఎలాంటి వ్యర్థాలు రోడ్లపై, మురుగు కాలువల పక్కన కనిపించకూడదని ఆదేశించారు. పారిశుద్ధ్య పనుల విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే సహించేది లేదని కమిషనర్ హెచ్చరించారు. నిజమాబాద్ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడం పై దృష్టి సారించాలని శానిటరీ ఇన్‌స్పెక్టర్లకు కమిషనర్ సూచించారు. పారిశుద్ధ్య సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే శానిటరీ ఇన్‌స్పెక్టర్లే బాధ్యత వహించాల్సి వస్తుందన్నారు. విధుల్లోకి హాజరయ్యే విషయంలో సరైన సమయపాలన పాటించాలని, సంబంధిత క్షేత్రానికి సమయానికి చేరుకుని పనులు ప్రారంభించాలని కమిషనర్ పారిశుద్ధ్య సిబ్బందికి సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.