విజ్ఞాన్ లో ఆనందోత్సవం...

by Disha Web Desk 20 |
విజ్ఞాన్ లో ఆనందోత్సవం...
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : జిల్లా కేంద్రంలోని విజ్ఞాన్ హై స్కూల్ 30వ వార్షికోత్సవ సంబరాలు ఘనంగా జరిగాయి. శుక్రవారం సాయంత్రం పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో జరిగాయి. విజ్ఞాన్ హై స్కూల్ 30వ వార్షికోత్సవంను నిజామాబాద్ జిల్లా జాయింట్ కలెక్టర్ చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జేసి చంద్రశేఖర్ మాట్లాడుతూ పదోతరగతి విద్యార్థులు ఈ మూడు నెలల సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఉపాధ్యాయులు చెప్పినట్టు చదువుకొని నిర్భయంగా పరీక్షలు రాసి తల్లిదండ్రులకు, జిల్లాకు, విద్యాసంస్థకు మంచి పేరు తేవాలని ఆయన ఆకాంక్షించారు. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్న విద్యార్థినీ విద్యార్థులకు ఆయన ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు.

ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థుల మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని ఆయన అన్నారు. విజ్ఞాన్ హై స్కూల్ ఆనందోత్సవము 2023 వార్షికోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన ప్రైవేటు విద్యాసంస్థల రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్ రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యాభివృద్ధిలో ప్రైవేటు పాఠశాలల పాత్ర కీలకంగా ఉన్నదని సుమారు 55 శాతం విద్యార్థులకు ప్రైవేటు విద్యా సంస్థలు విద్యను అందించడమే కాకుండా గణనీయంగా నిరుద్యోగ సమస్యను తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తున్నాయని అన్నారు. ఇందుకు సహకరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్ వి దుర్గాప్రసాద్ మాట్లాడుతూ.. ప్రైవేట్ విద్యా సంస్థ అందిస్తున్న విద్యా సేవల పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.. ఇటువంటి యాన్యువల్ డే సంబరాలు విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలిగితీయటానికి ఉపయోగపడతాయని ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విజ్ఞాన్ యాజమాన్యాన్ని ఈ సందర్భంగా ఆయన అభినందించారు.

అంతకుముందు విచ్చేసిన యాంకర్ మృదుల, జబర్దస్త్ ఫేమ్ రాము విద్యార్థులను తమ అద్భుతమైన మాటలతో అలరించారు. అదేవిధంగా వారు సందడి చేసి నిజామాబాద్ విజ్ఞాన హై స్కూల్ 30 వార్షికోత్సవంలో పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులను విద్యార్థులను పాఠశాల యాజమాన్యాన్ని సంతోషపరిచారు. ఈ సందర్భంగా విజ్ఞాన్ హై స్కూల్ పాఠశాల యాజమాన్యం కవిత,జయ సింహ గౌడ్ మాట్లాడుతూ.. విద్యార్ధుల తల్లితండ్రులకు , మిత్రులకు, శ్రేయోభిలాషులకు, ముఖ్యంగా గౌరవ అతిధులకు, సంఘ సభ్యులకు పేరుపేరునా స్వాగతం తెలియజేశారు.

ఈ చల్లని సాయంత్రం వేళ ప్రతి ఒక్కరికి ఆహ్వానాన్ని గౌరవించి వచ్చిన వారికి ప్రత్యేకంగా ధన్యవాదములు తెలియజేశారు. విజ్ఞాన్ హై స్కూల్ అనేది ఒక చక్కటి వాతావరణంలో అందరినీ ప్రేమతో స్వాగతించి విద్యార్ధి విద్యనభ్యసించే కేంద్రం అని పాఠశాల యాజమాన్యం కవిత జయ సింహ గౌడ్ తెలియజేశారు. విద్యా రంగంలో 30 సంవత్సరాలు పూర్తి అంటే చిన్న విషయం కాదని అన్నింటినీ తట్టుకొని నిలబడి, నాకు తోడ్పాటునందించిన సేపూర్ కవిత కి ఈ సందర్భంగా నా హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిధులుగా ఎసిపి వేంకటేశ్వర్, టిఎన్జీవోఎస్ జిల్లా అధ్యక్షులు అలక కిషన్, పిఆర్టియు జిల్లా అధ్యక్షులు మోహన్ రెడ్డి, కార్యదర్శి వెంకటేశ్వర్ గౌడ్, పాఠశాల ఉపాధ్యాయ బృందం విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed