మిస్టర్ డెవలప్ మెంట్ ఎమ్మెల్యే కాదు . . . మోస్ట్ కరప్టెడ్ ఎమ్మెల్యే

by Disha Web Desk 15 |
మిస్టర్ డెవలప్ మెంట్ ఎమ్మెల్యే కాదు . . . మోస్ట్ కరప్టెడ్ ఎమ్మెల్యే
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్త మోస్ట్ డెవలప్ మెంట్ ఎమ్మెల్యే కాదని మోస్ట్ కరప్టెడ్ ఎమ్మెల్యే అని నిజామాబాద్ కాంగ్రెస్ అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థి మొహమ్మద్ షబ్బీర్ అలీ విమర్శించారు. మంగళవారం నిజామాబాద్ నగరంలోని 28వ డివిజన్ గాజులపేట్ లో కార్నర్ మీటింగ్ లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిస్టర్ డెవలప్మెంట్ గా తనకు తానుగా బిరుదు ఇచ్చుకున్న ఎమ్మెల్యే ఒకసారి గాజులపేటకు వచ్చి చూస్తే అస్తవ్యస్తమైన రోడ్లు, మురికితో నిండిపోయిన డ్రైనేజీలు, చెత్తాచెదారంతో నిండిపోయిన రోడ్లు దర్శనమిస్తాయని అన్నారు. నిజామాబాద్ పట్టణంలో చుట్టుపక్కల గ్రామాల నుండి చాలామంది ప్రజలు షాపింగ్ చేసుకోవడానికి వస్తారని, ఇక్కడి మార్కెట్లో ట్రాఫిక్ ఇబ్బందుల

వల్ల వాహనాల్లో వచ్చి షాపింగ్ చేసుకునే పరిస్థితి లేదన్నారు. పది సంవత్సరాల కాలంలో నిజామాబాద్ పట్టణంలో హామీ ఇచ్చి మాస్టర్ ప్లాన్ ఎందుకు అమలు చేయలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రాష్ట్రంలోనే నిజామాబాద్ పట్టణాన్ని అందమైన పట్టణంగా తీర్చిదిద్దుతామన్నారు. మీరందరూ కాంగ్రెస్ పార్టీని బలపరిచి ఓటు వేసి గెలిపించండి మీ సమస్యలన్నీ పరిష్కరిస్తామన్నారు. సోనియాగాంధీ ప్రకటించిన ఆరు పథకాలను అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో అమలు చేస్తామన్నారు. ప్రతి ఇంటికి 200 యూనిట్లు కరెంటు ఫ్రీ, ఇంట్లో అర్హులైన వారందరికీ పెన్షన్లు, పెళ్లయిన ఆడపడుచులకు 2500 చేయూత, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ తో పాటు మరెన్నో పథకాల ద్వారా పేదల జీవితాల్లో వెలుగు నింపుతామన్నారు. ఈ ప్రచారంలో మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, నగర అధ్యక్షులు కేశ వేణు, నాయకులు అదే ప్రవీణ్ తదితరులు ఉన్నారు.


👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Read Disha E paper
👉 Follow us on Google News
👉 Follow us on whatsapp channelNext Story