- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- కెరీర్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- ఆరోగ్యం
- స్పోర్ట్స్
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫోటోలు
- జిల్లా వార్తలు
- భక్తి
ఎంపీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: కన్వీనర్
by Disha Web |

X
దిశ, బోధన్: ఎస్సీ, ఎస్టీ హక్కుల పరిరక్షణ కమిటీ బోధన్ డివిజన్ ఆధ్వర్యంలో నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ భారత రాజ్యాంగంపై అనుచిత వాఖ్యలు ఖండిస్తూ శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కన్వీనర్ ఈశ్వర్ మాట్లాడుతూ.. ఎంపిగా ప్రమాణ స్వీకారం చేసే ముందు రాజ్యాంగంపై ప్రమాణం చేసిన ఎంపి అరవింద్ యాదమర్చి మాట్లాడటం సిగ్గు చేటన్నారు. రాజ్యాంగాన్ని మార్చడం ఎవరి సోత్తూ కాదని ఆరోపించారు.
ఎంపి దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని, లేదంటే ఎంపి పై దేశ ద్రోహం కేసులు నమోదుకు పోరాటాలు చేయవలసి వస్తుందని హెచ్చరించారు. అదేవిధంగా ఎంపి ఇంటి ముట్టడి లాంటి ఆందోళనా కార్యక్రమాలను చేపట్టి మేడలు వంచుతామని తెలిపారు. ఈ సమావేశంలో బోధన్ ఎస్సీ ఎస్టీ హక్కుల పరిరక్షణ కమిటీ కన్వీనర్ ఈశ్వర్, ఉపాధ్యక్షులు సింగడి పాండు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Next Story