ఢిల్లీ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులను అభినందించిన ఎంపీ అరవింద్

by Aamani |
ఢిల్లీ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులను అభినందించిన ఎంపీ అరవింద్
X

దిశ ప్రతినిధి,నిజామాబాద్ : ఢిల్లీ ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఎన్నికల ప్రచార ఇంఛార్జ్ గా వ్యవహరించిన రెండు చోట్లా బీజేపీ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుపొందారు. ఇందూరులోనే కాదు తాను ఢిల్లీ లోనూ గోల్డెన్ హ్యాండ్ నేనని నిరూపించుకున్నారు. గెలిచిన బీజేపీ అభ్యర్థులను ఎంపీ అరవింద్ స్వయంగా కలిసి అభినందించారు. ఆర్ కే పురం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి అనిల్ శర్మ, జంగ్ పూర్ నియోజవర్గం నుంచి పోటీ చేసిన అరవింద్ సింగ్ మార్వాలు ఇద్దరి తరఫున ఎంపీ అర్వింద్ ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో తమ సమీప ఆప్ అభ్యర్థులపై భారీ మెజార్టీతో గెలుపొందారు. వీరి విజయంలో ఎంపీ అరవింద్ ధర్మపురి పాత్ర చాలా ఉందని గెలుపొందిన ఇద్దరు విజేతలు ఎంపీ కి కృతజ్ఞతలు తెలియజేశారు.

Next Story