రికార్డు టైంలో హై లెవెల్ వంతెనల నిర్మాణాలు పూర్తి..

by Disha Web Desk 20 |
రికార్డు టైంలో హై లెవెల్ వంతెనల నిర్మాణాలు పూర్తి..
X

దిశ, భీమ్‌గల్‌ : ఉమ్మడి రాష్ట్రచరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్, మోతె గ్రామాల్లో రికార్డు సమయంలో హై లెవెల్ వంతెనల నిర్మాణాలు పూర్తి చేసుకోవడం ఎంతో సంతోషం కలిగించిందని రాష్ట్ర రోడ్లు - భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. వేల్పూర్ పెద్దవాగు పై రూ. 15 కోట్లతో నూతనంగా నిర్మించిన హై లెవల్ బ్రిడ్జ్ తో పాటు, మోతె కప్పల వాగు పై రూ.12 కోట్లతో నూతనంగా నిర్మించిన హై లెవల్ బ్రిడ్జ్ లను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ వారధుల నిర్మాణాలతో వేల్పూర్ - భీంగల్ మార్గంలో రవాణా సదుపాయం మరింతగా మెరుగుపడినట్లయ్యింది.

ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే తన సొంత నియోజకవర్గంలో రెండు హై లెవెల్ వంతెనలను పూర్తి చేసుకున్నామన్నారు. ఇంత స్వల్ప వ్యవధిలో బ్రిడ్జిల నిర్మాణాలు పూర్తి చేయవచ్చని ఆచారణాత్మకంగా నిరూపించిన ఆర్ అండ్ బీ అధికారులు, స్థానిక కాంట్రాక్టర్లను మంత్రి అభినందించారు. రికార్డు టైంలో పూర్తయిన వేల్పూర్, మోతే బ్రిడ్జిలు రాష్ట్రానికి మార్గదర్శకంగా నిలువబోతున్నాయని పేర్కొన్నారు. బ్రిడ్జిల నిర్మాణాలకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజల తరపున మంత్రి ప్రశాంత్ రెడ్డి కృతజ్ఞతలు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బీ ఎస్.ఈ రాజేశ్వర్ రెడ్డి, స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

Next Story

Most Viewed