మెడికవర్ ఆసుపత్రిలో ఓపి సేవలు ప్రారంభం..

by Disha Web |
మెడికవర్ ఆసుపత్రిలో ఓపి సేవలు ప్రారంభం..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నగరంలోని ఎల్లమ్మగుట్టలోని మెడికవర్ ఆసుపత్రి, హైదరాబాద్ రోడ్డు లోని సురేష్ జాజు ఆసుపత్రిలో ఓపి సేవలను అందించే విధంగా నూతన మెడికవర్ ఓపి బ్లాక్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమాలకి మెడికవర్ గ్రూప్ సీఈవో మహేష్ దెగలూర్కర్ , మెడికవర్ వైస్ ప్రెసిడెంట్ మేఘ చిట్కార హాజరయ్యారు. నూతన మెడికవర్ ఆసుపత్రి ఓపి బ్లాక్ విభాగం ప్రారంభించిన అనంతరం మెడికవర్ వైసెప్రెసిడెంట్ మేఘ చిట్కార మాట్లాడుతూ ఉభయ తెలుగురాష్ట్రాల్లో నాన్యమైన వైద్య సేవలు అందిస్తూ మహారాష్ట్రలో నాలుగు బ్రాంచులను విస్తరించి మహారాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా ముంబయి, పూణే లలో అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రారంభించడమైందన్నారు. త్వరలో మనరాష్ట్రంలోని వరంగల్ సహా మరిన్ని జిల్లాల్లో ప్రజలకి మరింత నాన్యమైన వైద్య సేవలను అందించే విధంగా విస్తరిస్తున్నామని తెలిసారు.

మెడికవర్ గ్రూప్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మహేష్ దెగ్లూర్కర్ మాట్లాడుతూ నగరంలో గల ఇప్పుడున్న వంద పడకల ఆసుపత్రికి అనుబంధంగా మెడికవర్ ఓపెన్ విభాగం వైద్యసేవలు ఉదయం 9గంటల నుండి సాయంత్రం 6గంటల వరకు ఓపి సేవలతో పాటుగా అత్యవసర వైద్య విభాగం సర్వీస్ లను సైతం అందిస్తూ నూతన వైద్య సదుపాయాలతో జిల్లా ప్రజలకి మరింత చేరువ చేస్తూ క్లిష్టమైన ఆరోగ్య సమస్యలకు హైదరాబాద్ వరకు రానవసరం లేకుండా అంతర్జాతీయ ప్రమాణాల నాన్యమైన సేవలని జిల్లా ప్రజలకు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు డాక్టర్ భూపతిరెడ్డి , డాక్టర్ సందీప్రావ్, డాక్టర్ రవికిరణ్, డాక్టర్ దత్తురాజ్, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ కార్తీక్, డాక్టర్ యజ్ఞ, మేనేజ్ మెంట్ స్వామి, శ్రీనివాస్ శర్మ, లహరి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
Next Story

Most Viewed