కామారెడ్డి జిల్లాలో అర్హత లేని వైద్యులపై మెడికల్ కౌన్సిల్ దాడులు

by Kalyani |
కామారెడ్డి జిల్లాలో అర్హత లేని వైద్యులపై మెడికల్ కౌన్సిల్ దాడులు
X

దిశ, బాన్సువాడ : తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యులు డా. ఏ.సన్నీ డేవిస్, డా.శిరీష్ కుమార్ నేతృత్వంలో కామారెడ్డి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో అర్హత లేని వైద్య ప్రాక్టీషనర్లపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ప్రజల ఆరోగ్యాన్ని రక్షించాలనే ఉద్దేశ్యంతో గంధారి, బాన్సువాడ, పిట్లం మూడు ప్రాంతాల్లో ఈ తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో గంధారి లో నలుగురు, బాన్సువాడ పట్టణంలో రెండు పిట్లం లో ఒకటి తనిఖీల సందర్భంగా అనుమానస్పద వైద్యులు క్లినిక్స్ నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఈ కేంద్రాలలో పని చేస్తున్న వ్యక్తులు ఎలాంటి వైద్య అర్హతలు లేకుండానే వైద్య సేవలు అందిస్తున్నట్టు తేలింది. ఇది ప్రజారోగ్యానికి ప్రమాదకరమని, ఇటువంటి అక్రమ వైద్య ప్రాక్టీసులను సహించబోమని మెడికల్ కౌన్సిల్ స్పష్టం చేసింది. ఈ మేరకు సంబంధిత అధికారులకు నివేదిక సమర్పించనుండగా, త్వరలోనే కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ మెడికల్ కౌన్సిల్ తెలిపింది. ప్రజలు కూడా ఇటువంటి అనుమానాస్పద వైద్యుల విషయమై అప్రమత్తంగా ఉండలని స్థానిక ఆరోగ్య శాఖకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ హైదరాబాద్ ఆధ్వర్యం లో ఈ దాడులు నిర్వహించారు.

Next Story

Most Viewed