దేగం హెల్త్ సూపర్ వైజర్ సుభాష్ మృతి

by Disha Web |
దేగం హెల్త్ సూపర్ వైజర్ సుభాష్ మృతి
X

దిశ, ఆర్మూర్: ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆలూరు మండలంలోని దేగం గ్రామంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో హెల్త్ సూపర్ వైజాగ్ గా పనిచేస్తున్న అర్గుల్ సుభాష్ శనివారం మృతిచెందారు. సుభాష్ మృతికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. హెల్త్ సూపర్ వైజర్ గా విధులు నిర్వహిస్తున్న అర్గుల్ సుభాష్ కు బ్రెయిన్ లో నీరు రావడంతో అనారోగ్యానికి గురయ్యాడు. ఇది గ్రహించిన ఆయన కుటుంబీకులు ఆయనను ముందుగా జిల్లాలో ఆస్పత్రుల్లో చికిత్స చేయించి మరింత మెరుగైన చికిత్స కోసం రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు. హైదరాబాదులోని కిమ్స్ ఆస్పత్రిలో సుభాష్ కు రెండు శస్త్రచికిత్సలు జరిగిన బ్రెయిన్ లో బ్లడ్ ప్లాట్ అయ్యి శనివారం రాత్రి మృతిచెందారు. హైదరాబాద్ నుంచి సుభాష్ మృతదేహాన్ని అంత్యక్రియలు నిమిత్తం నిజామాబాద్ జిల్లా కేంద్రానికి తరలించగా ఆదివారం అంత్యక్రియలు జరగనున్నాయి. మృతుడు సుభాష్ కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
Next Story