- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
ఆగి ఉన్న ప్యాసింజర్ రైలులో వ్యక్తి ఆత్మహత్య
by Naveena |
X
దిశ, నిజామాబాద్ : బోధన్ రైల్వే స్టేషన్ లో ఆగి ఉన్న గుంతకల్ ప్యాసింజర్ రైల్లో ఓ వ్యక్తి మంగళ వారం రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సుమారు 55 ఏళ్ల వయసున్న గుర్తు తెలియని వ్యక్తి టవల్ తో ఊరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని నిజామాబాద్ రైల్వే ఎస్ ఐ సాయిరెడ్డి తెలిపారు. నిజామాబాద్ రైల్వే స్టేషన్ మేనేజర్ నవీన్ కుమార్ ఇచ్చిన సమాచారం మేరకు సంఘటన స్థలానికి వెళ్లి చూడగా ఆ వ్యక్తి ట్రైన్ లో ఊరి వేసుకొని ఉన్నట్లు, మృతుడి వద్ద అతని వివరాలు తెలిపే ఎలాంటి ఆధారాలు లభించలేదని ఎస్ ఐ తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు..మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడిని ఎవరైనా గుర్తు పడితే వెంటనే నెం. 8712658591 కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని పోలీసులు తెలిపారు.
Advertisement
Next Story