- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
నాయకపోడులకు ఎస్టీ సర్టిఫికెట్ ఇప్పించాలి : మొట్ట పెంటయ్య

దిశ, నిజాంసాగర్ : నాయకపోడ్ కులస్తులకు ఎస్టీ ధృవీకరణ సర్టిఫికెట్ ఇప్పించాలని నాయకపోడ్ జిల్లా అధ్యక్షుడు మొట్ట పెంటయ్య ఆధ్వర్యంలో సోమవారం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావుకు వినతి పత్రం అందజేశారు. మొహమ్మద్ నగర్ మండలంలో నాయకపోడ్ ఎస్టీ కుల ధ్రువీకరణ సర్టిఫికెట్ ల సమస్యల గురించి విన్నవించారు. ఎమ్మెల్యే సమస్యలను సాధికారంగా విని సమస్యల పరిష్కార దిశగా చూస్తానని చెప్పారు. మండలంలోని అన్ని గ్రామాల నాయకపోడ్ కులస్తులు పెద్ద సంఖ్యలో వచ్చి ఎమ్మెల్యేకు వినతి పత్రం ఇచ్చారు. దీని పై 1992లో ట్రైబల్ ఆఫీస్ హైదరాబాద్ నుండి వచ్చి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు వచ్చి నాయకపోడ్ గురించి విచారణ చేసి నాయకపోడ్ లకు ఎస్టీ సర్టిఫికెట్ ఇచ్చారన్నారు.
1997 జీవో నెంబర్ 11, జీవో నెంబర్ 144 ప్రకారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 358 సర్ నేమ్ లను గుర్తించి ఎస్టీ సర్టిఫికెట్లు ఇస్తున్నారు. గత రెండు, మూడు నెలలుగా తహశీల్దార్, సబ్ కలెక్టర్ అవగాహన లోపంతో సర్టిఫికెట్లు ఇవ్వడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని, ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వెంటనే ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ కు ఫోన్ చేసి సమస్యను వివరించి పరిష్కరించాలని ఆయన సూచించారు. విద్యార్థులు గురుకుల మోడల్ స్కూల్లో సీట్లు కోల్పోతున్నారు. ప్రభుత్వ సంక్షేమం, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు నాయకపోడ్ కులస్థులకు అన్యాయం జరుగుతుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చికోటి మనోజ్ కుమార్, ఉమ్మడి మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలే.మల్లికార్జున్, రవీందర్ రెడ్డి, జిల్లా ఎస్టీ సెల్ ఉపాధ్యక్షుడు లోక్య నాయక్ నాయకులు సవాయి సింగ్, మల్లయ్య గారి ఆకాష్, శ్రీధర్ రెడ్డి, మోయిన్, నాయక్ పోడ్ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.