- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కౌలాస్ కోట నిర్మాణం మహా అద్భుతం :జిల్లా ఎస్పీ

దిశ,జుక్కల్: జుక్కల్ నియోజకవర్గంలోని కౌలాస్ కోట అందాలు, కట్టడాలు మహా అద్భుతంగా ఉన్నాయని కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ అన్నారు. ఆమె ఆదివారం కౌలాస్ కోటను సందర్శించారు. కోటలో మూడు గంటల పాటు తిరిగి పురాతన నిర్మాణాలు, మందిరాలను, కట్టడాలను తిలకించారు. కౌలాస్ కోట చారిత్రక వివరాలు, కౌలాస్ గ్రామ చరిత్రను స్థానికులు ఎస్పీ కి వివరించారు. కోటలో మూడు గంటల పాటు తిరిగి తొమ్మిది గజాల ఫిరంగి, హనుమాన్ మందిరం, రామాలయం, సరస్వతి మాత, వెంకటేశ్వరా మందిరం ,పట్టే మంచం, తామర కొలను, మల్లికా బురుజు, ఆయుధ గారాలు, ధాన్యగారాలు, కంధకాలు, తదితర వాటిని తిలకించి వాటి అందాలను వర్ణించారు. కోట వెలుపల ఉన్న అష్ట భుజ మాత మందిరాన్ని సందర్శించి పూజలు చేసి తీర్త ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో ట్రైనీ ఐపిఎస్ లు, కామారెడ్డి అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి, ఎల్లారెడ్డి డిఎస్పి శ్రీనివాసులు, బిచ్కుంద సీఐ జే.నరేష్, బాన్స్ వాడ రూరల్ సీఐ రాజేష్, టౌన్ సిఐ అశోక్, స్థానిక ఎస్సై భువనేశ్వర్ తోపాటు, కౌలాస్ గ్రామ నాయకులు అనిత సింగ్, పాకాల వెంకటి, చిన్న హన్మగౌడ్ తదితరులు పాల్గొన్నారు.