అమృతలత అపురూప అవార్డ్స్ - 2015కి చీఫ్ గెస్ట్ గా కళాతపస్వి..

by Disha Web Desk 20 |
అమృతలత అపురూప అవార్డ్స్ - 2015కి చీఫ్ గెస్ట్ గా కళాతపస్వి..
X

దిశ, నిజామాబాద్ సిటీ : ఆకాశం నుంచి దిగివచ్చి అవని పై విరబూసిన సిరివెన్నెల, నటరాజస్వామి పాద మంజీరాల నుంచి జారిపడిన సిరిసిరిమువ్వ బ్రహ్మపీఠమైన స్వర్ణకమలం, అరుదైన ఓ స్వాతిముత్యం తెలుగు చిత్ర సీమకు సాక్షాత్ కాశి విశ్వనాథుని వర ప్రసాదం కె విశ్వనాథ్. గొప్ప సంగీత సాహిత్యాలకు సమతూకం వేయగల రసజ్ఞులు అయిన విశ్వనాథ్ తో నిజామాబాద్ జిల్లాకు అనుబంధం ఉంది. రెండు సార్లు నిజామాబాద్ జిల్లాకు రాగా అందులో మొదటి సారి వీపీఎస్ స్కూల్ టాలెంట్ షో కు, రెండవ సారి అపురూప వెంకటేశ్వర ఆలయానికి వచ్చారు.

అదేవిధంగా హైదరాబాద్ లో నిర్వహించిన అమృతలత అపురూప అవార్డ్స్ 2015 కార్యక్రమానికి కూడా ఆయన చీఫ్ గెస్ట్ గా వచ్చారు. విశ్వనాథతో కలసి వేదికను పంచుకొన్న ఆనాటి తీపి జ్ఞాపకాలను దిశతో పంచుకున్నారు. కవయిత్రి, విజయ్ విద్య సంస్థల చైర్మన్ డాక్టర్ అమృత లత, తాను పాత్రధారులచే నవరసాలు పండించగల తెర వెనుక సూత్రధారి అని, ఏ నటుడు నుంచైనా తాను అనుకున్న నటనను రాబట్టగల ప్రతిభాశాలి అని గుర్తు చేసుకున్నారు. శంకరా భరణం అవార్డును తనకు ప్రధానం చేసి సన్మానించారని, విశ్వనాథ్ లాంటి మహనీయులు లేకపోవడం సినీ ప్రపంచానికి తీరని లోటని అన్నారు. విశ్వనాథ్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.


Next Story

Most Viewed