జుక్కల్ కాంగ్రెస్ అభ్యర్థి తోట లక్ష్మి కాంత్ రావు గెలుపు

by Disha Web Desk 15 |
జుక్కల్ కాంగ్రెస్ అభ్యర్థి తోట లక్ష్మి కాంత్ రావు గెలుపు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ జుక్కల్ నియోజకవర్గం లో గెలుపుతో బోణి కొట్టింది. జుక్కల్ కాంగ్రెస్ అభ్యర్థి తోట లక్ష్మి కాంత్ రావు బీఆర్ఎస్ అభ్యర్థి హన్మంత్ షిండే పై 1760 ఓట్లతో గెలుపు సాధించారు. నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తరుపున చివరగా టికెట్ సాధించినప్పటికి తొలి గెలుపును నమోదు చేశారు. జుక్కల్ నియోజకవర్గంలో సంబరాలు చేసుకుంటున్నాయి కాంగ్రెస్ శ్రేణులు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరుగుతున్న ఓట్ల లెక్కింపులో 12 వ రౌండ్ వరకు జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే ఆదిక్యం ప్రదర్శించినా చివరి మూడు రౌండ్ లలో మాత్రం స్పష్టమైన మెజార్టీతో తోట లక్ష్మి కాంత్ రావు విజయం సాధించారు.Next Story