నాందేడ్ సభ సక్సెస్.. బీఆర్ఎస్ లో జోష్..

by Disha Web Desk 20 |
నాందేడ్ సభ సక్సెస్.. బీఆర్ఎస్ లో జోష్..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నాందేడ్ లో జరిగే బహిరంగ సభను సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో నిజామాబాద్ ఉమ్మడి జిల్లా నాయకులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ముఖ్యంగా సభావేదికతో పాటు జనాన్ని సమీకరించడంలో సక్సెస్ అయ్యారు. సభాప్రాంగణమంతా జనంతో నిండి పోవడంతో కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. బీఆర్ ఎస్ ను దేశ వ్యాప్తంగా తీసుకెళ్లడానికి ఇదే ఉత్సహంతో ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నట్లుసీయం కేసిఆర్ స్పీచ్ లో కనిపించింది. అదివారం మహరాష్ర్టలోని నాందేడ్ జిల్లా కేంద్రంలోని సచ్ కండ్ గురుద్వార బోర్డు స్టేడియంలో జరిగిన బిఆర్ఎస్ మహసభ సక్సేస్ కావడంతో జిల్లా నేతలు ఉపిరి పిల్చుకున్నారు.

భారత్ రాష్ట్ర సమితీ ఏర్పాటు చేసిన తరువాత మొదటి సారి తెలంగాణ రాష్ట్రం పక్కనే ఉన్న మహారాష్ట్రలోని నాందేడ్ లో సభ ఏర్పాటు చేయాలనే నిర్ణయం తీసుకోవడానికి ఆ ప్రాంతంలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య ఎక్కువగా ఉండటం కూడా కారణంగా చెప్పోచ్చు. నిజామాబాద్ జిల్లా సరిహద్ధు తో పాటు స్థానిక ప్రజలు మరాఠా ప్రజలతో వ్యాపార వాణిజ్య సంబంధాలతో పాటు రక్త సంబంధాలు కలిసి ఉండటం, బిఆర్ఎస్ సభను మహరాష్ర్లలో ఉంటుందని ప్రకటించిన నాటి నుంచి జిల్లాకు చెందిన నేతలకు బహిరంగ సభ సమావేశం సక్సెస్ భాధ్యతలు అప్పగించారు. జిల్లా కు చెందిన ఎమ్మెల్యేలు షకిల్ అమేర్, హన్మంత్ షిండే, జీవన్ రెడ్డిలతో పాటు జహిరాబాద్ ఎంపి బిబి పాటిల్ స్థానికంగా తిష్టవేసి అక్కడ సమావేశం సక్సేస్ చేయ్యడంలో సఫలం అయ్యారని అదివారం నాటి సభకు వచ్చిన జనసమూహం రుజువు చేసింది.

నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు చెందిన నేతలకు మహరాష్ర్టలో జరిగిన సభకు భాధ్యతలు అప్పగించడం వెనుక మతలబు ఉంది అనే చర్చ జరుగుతుంది. బోదన్ ఎమ్మెల్యే షకిల్ రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పార్టి తనకు పధవులు ఇవ్వలేదని కినుకు వహించారు. తన కుటుంబ సభ్యులకు సైతం కార్పోరేషన్ పధవులు ఇవ్వకపోవడంతో చాల రోజులుగా పార్టి కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. జహిరా బాద్ ఎంపీ బీబీ పాటిల్ పార్టి నుంచి రెండుసార్లు గెలిచిన పార్లమెంట్ నియోజకవర్గంలో ఆయనకు పార్టిలో పెద్ధగా ప్రాధన్యత ఇచ్చినట్లు కనబడలేదు. ఇక ఉమ్మడి జిల్లాలో సీనియర్ దళిత ఎమ్మెల్యేగా ఉన్న హన్మంత్ షిండేకు సైతం నాందేడ్ సభకు ముందుగా పార్టిలో పెద్ధగా ప్రాధన్యత లేదు.

టీఆర్ఎస్ కాస్తా బీఆర్ఎస్ గా మారడంతో జాతీయ రాజకీయాలకు జిల్లా నేతలను వాడుకోవడంతో పాటు పోరుగు రాష్ర్టంలో బీఆర్ఎస్ విస్థరణకు ఇందూర్ జిల్లా ప్రజాప్రతినిధులకు బాధ్యతలను అప్పగించినట్లు వినికిడి. బిఆర్ఎస్ పార్టిలోకి నాందేడ్ సభలో మాజీ ఎమ్మెల్యేలు, ఎంపిలతో పాటు, జడ్పి, మున్సిపల్, పంచాయతీ స్థాయి నేతలను చేర్చడంలో జిల్లా నేతలు సక్సేస్ అయ్యారు. ఉమ్మడి జిల్లా నుంచి నాందేడ్ సభకు జుక్కల్, బోదన్ తో పాటు, బాన్సువాడ ప్రాంతాలకు చెందిన ప్రజలను తరలించడంలో సక్సేస్ అయ్యారు. ఈ సభ కు బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డితో పాటు తెలంగాణ మహిళ పైనాన్స్ కార్పొరేషన్ చైర్మెన్ ఆకుల లలీతతో పాటు జిల్లా నేతలు నాందేడ్ సభ సక్సేస్ కు పాటుపడి సీయం కేసిఆర్ మనసు దోచుకున్నారు అని చెప్పాలి.

ఆదివారం నాందేడ్ జిల్లా కేంద్రంలో జరిగిన బీఆర్ఎస్ బహిరంగ సభకు నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. ఇటివల కాలంలో డిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ చార్జీషీట్ లో పేరు వచ్చిన నాటి నుంచి నిజామాబాద్ జిల్లా రాజకీయాలకు కవిత దూరంగా ఉన్న కవిత నాందేడ్ సభకు సీఎం కేసీఆర్ తో పాటు హజరయ్యారు. గురుద్వారలో ప్రత్యేక ప్రార్థనలతో పాటు బహిరంగ సభలో సీఎం కేసిఆర్ తో పాటు సభావేదికను పంచుకోన్నారు. నిజామాబాద్ రాజకీయాలు ముందస్ధు ఎన్నికల ఉహగానాల నేపథ్యంలో వేడెక్కక ముందే బీఆర్ఎస్ జాతీయ రాజకీయాల వైపు కవిత చూపు అన్న చంధంగా మరాట్వాడ ప్రాంతంలో జరిగిన సభకు హజరు కావడాన్ని రాజకీయ వేశ్లేషకులను అలోచనలో పడేశాయి. ఎమ్మెల్సీ కవిత తో పాటు ఎమ్మెల్యేలు షకిల్, హన్మంత్ షిండే, ఎంపీ బీబీ పాటిల్ లు స్థానిక నాయకులను సీయం కేసిఆర్ కు పరిచయం చేయడం తో పాటు పార్టిలో చెరేవారికి కండువాలను ఇచ్చి పార్టిలో చేరేలా సభ వేదికపై సంధడి చేశారు.


Next Story

Most Viewed