Inspection of pilot test centres

by Naveena |
Inspection of pilot test centres
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ ఫిబ్రవరి 16: నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో మూడో స్పెల్ ప్రయోగ పరీక్షలు నిర్వహిస్తున్న ప్రయోగ పరీక్ష కేంద్రాలను ఆదివారం జిల్లా ఇంటర్ విద్యాధికారి రవికుమార్ తనిఖీ చేశారు. నిజామాబాద్ పట్టణంలో ప్రయోగ పరీక్షలు జరుగుతున్న రవి కాకతీయ జూనియర్ కళాశాల, సత్య ఒకేషనల్ జూనియర్ కళాశాల, ఎస్ ఆర్ జూనియర్ కళాశాలలను ఇంటర్ విద్యాధికారి రవికుమార్ తనిఖీ చేశారు. జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు చిన్నయ్య, రజియుద్ధీన్ అస్లామ్, కనకమహాలక్ష్మి, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు జిల్లాలో మరో 12 కేంద్రాలను తనిఖీ చేశారు. ప్రతి పరీక్ష కేంద్రంలో కెమెరాలు పనిచేస్తున్న విషయాన్ని స్వయంగా ఇంటర్ విద్య అధికారి, పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు పరిశీలించి సమీక్షించారు.

ఈ సందర్భంగా ఇంటర్ విద్యాధికారి రవికుమార్ మాట్లాడుతూ..ప్రతి పరీక్షా కేంద్రంలో కెమెరాలకు జియో ట్యాగింగ్ ను పరిశీలించామని, కెమెరాలు ఆగిపోకుండా ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ అవి చక్కగా పని చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపాల్స్ ను ఆదేశించామన్నారు. ప్రతి పరీక్షా కేంద్రంలో నిబంధనల మేరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించాలని జిల్లా ఇంటర్ విద్యాధికారి ఆదేశించారు. లైవ్ కెమెరాల ద్వారా జిల్లాలో జరుగుతున్న ప్రయోగ పరీక్షలకు హైదరాబాద్ లో కమాండ్ కంట్రోల్ సెంటర్ లో కమిషనర్ పర్యవేక్షణ చేస్తున్నారని డీఐఈఓ రవికుమార్ అన్నారు.

Next Story

Most Viewed