- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆర్మూర్‌లో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అర్ధరాత్రి హల్‌చల్…
దిశ,ఆర్మూర్: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గం లోని ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో గురువారం అర్ధరాత్రి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి హల్చల్ చేశారు. సర్వసాధారణంగా ఏ అధికారి, ఏ ప్రజా ప్రతినిధి అయిన పగటిపూటనే కార్యాలయాలను సందర్శిస్తూ తనిఖీ చేస్తుంటారు. కానీ సాంప్రదాయానికి విరుద్ధంగా ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గురువారం అర్ధరాత్రి ఆర్మూర్ ఆర్టీసీ బస్టాండ్ ను, ఆర్మూర్ లోని 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ.. ఆర్మూర్ ఆర్టీసీ బస్టాండ్ ఏరియాలో, ప్రభుత్వ ఆసుపత్రిలో పగటి పూటలో అందించే సేవల వలె రాత్రిపూట కూడా ప్రజలకు సేవలు అందించాలని అధికారులకు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఆదేశించారు. రాత్రి సమయాల్లో ప్రజలకు అందిస్తున్న సేవలపై ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకమీదట పగలు రాత్రి అని తేడా లేకుండా ప్రజలకు అన్ని వేళ్ళల్లో సేవలు అందించాలని ఎమ్మెల్యే సూచించారు. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి వెంట బీజేపీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.