- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
పెర్కిట్ సొసైటీలో భారీ అవకతవకలు..

దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ ఏరియాలో గల సొసైటీలో భారీ అవకతవకలు జరిగినట్లు అసిస్టెంట్ రిజిస్టర్, సొసైటీ ఎంక్వైరీ ఆఫీసర్ కే.సత్యనారాయణ రావు బుధవారం ఎంక్వయిరీ రిపోర్టును సొసైటీలో అందజేశారు. సొసైటీ ఆవరణలో బుధవారం సొసైటీ చైర్మన్ పెంట బోజారెడ్డి, పాలకవర్గ సభ్యులు, అధికారుల సమక్షంలో గతంలో 8 మంది సొసైటీ డైరెక్టర్లు జిల్లా వ్యవసాయ అధికారికి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో చేస్తున్న ఎంక్వయిరీ రిపోర్టును ఎంక్వయిరీ ఆఫీసర్ కే. సత్యనారాయణ రావు చదివి వినిపించారు. వెంకట్ సొసైటీలో గతంలో తెలంగాణ రాష్ట్రంలో అమ్మకాలకు వీలులేని అగ్రిమార్ట్ కంపెనీకి చెందిన ఎరువులను 16 లక్షల పై చిలుకు నిధులతో గతంలో సొసైటీ చైర్మన్, కార్యదర్శి కొనుగోలు చేశారు. దానికి సంబంధించిన 11 లక్షల పై చిలుకు డబ్బులను ఆ కంపెనీకి చెల్లించారు.
కానీ మిగతా 4 లక్షల 85 వేల నగదును ఆ కంపెనీకి సొసైటీ చెల్లించలేదు. కానీ ఆ డబ్బులను సొసైటీ మాజీ కార్యదర్శి గౌస్ మొయినుద్దీన్ సొసైటీ అధికారుల జీతాలు, సొసైటీ ఇతర ఖర్చుల కోసం వెచ్చించారు. గతంలోనే సొసైటీ డైరెక్టర్లు అగ్రిమార్ట్ కంపెనీకి చెందిన చెల్లింపుల పై మిగిలిన డబ్బుల పై సొసైటీ కార్యదర్శి సొసైటీ సర్వసభ్య సమావేశంలోని గట్టిగా నిలదీశారు. సమాధానం పూర్తిగా చెప్పకపోవడంతో సొసైటీ డైరెక్టర్లు జిల్లా సొసైటీ అధికారికి సొసైటీలో అక్రమాలు జరుగుతున్నాయని ఎంక్వయిరీ చేయించాలని ఫిర్యాదు చేశారు. సొసైటీ డైరెక్టర్ల ఫిర్యాదుతో సొసైటీ అసిస్టెంట్ రిజిస్టర్, ఎంక్వయిరీ ఆఫీసర్ కే సత్యనారాయణ రావు సొసైటీలో జరిగిన లావాదేవీల పై క్షుణ్ణంగా పరిశీలించి రిపోర్ట్ తయారు చేసి బుధవారం సొసైటీ చైర్మన్ పెంట భోజ రెడ్డి, డైరెక్టర్లు, ఇతర సొసైటీ అధికారుల సమక్షంలో చదివి వినిపించారు. మాజీ సొసైటీ కార్యదర్శి ఎండీ. గౌస్ మొయినుద్దీన్ అగ్రి మార్ట్ కు సంబంధించిన 4,85,000 నగదుతో పాటు, కార్యదర్శి పదవి విరమణకు పొందవలసిన కన్నా ఎక్కువగా 1, 85,000 అధికంగా వాడుకున్నట్లు నిరూపమైందని ఎంక్వయిరీ ఆఫీసర్ సత్యనారాయణ వివరించారు.
సొసైటీలో దుర్వినియోగానికి మాజీ కార్యదర్శి గౌస్ మొయినుద్దీన్ పాల్పడ్డారంటూ సొసైటీకి సంబంధించిన నిధి అయిన అగ్రిమార్ట్ ఎరువుల నగదు 4,85,000, అధికంగా పొందిన పదవీ విరమణ గ్రాట్యూటీ నగదు 1,65,640లను దుర్వినియోగం చేసి వాడుకున్నారన్నారు. ఈ మొత్తం నగదు 6,70,640 రూపాయల నగదును మాజీ సొసైటీ కార్యదర్శి గౌస్ నుంచి రికవరీ చేయాలని సొసైటీ ఎంక్వయిరీ ఆఫీసర్ బుధవారం పెరికిట్ సొసైటీలో వెల్లడించారు. మాజీ కార్యదర్శి గౌస్ మొయినుద్దీన్ నుంచి ఆరు లక్షల పై చిలుకు నగదుతో పాటు 18 శాతం వడ్డీని వసూలు చేయాలని అధికారి వివరించారు. గతంలో సొసైటీ మాజీ కార్యదర్శి గౌస్ మొయినుద్దీన్ కు సొసైటీ చైర్మన్ పెంట భోజ రెడ్డి, మేనేజింగ్ కమిటీ సభ్యులు సహకరించారని ఎంక్వయిరీ అధికారి రిపోర్టులో వివరించారు. గతంలో పెరికిట్ సొసైటీలో అవకతవకలకు పాల్పడుతున్నాడంటూ సొసైటీ వైస్ చైర్మన్ గంగారెడ్డి, సొసైటీ డైరెక్టర్లు మామిడి ఏలియా రెడ్డి, మానేటి లింబాద్రి, మూడు అశోక్ చేపూర్ రాజు, తదితరులు మొత్తం 8 మంది సొసైటీ డైరెక్టర్లు జిల్లా సొసైటీ అధికారికి ఫిర్యాదు చేయడంతో సొసైటీలో జరిగిన అవకతవకలు నేడు అధికారి పూర్తిస్థాయి విచారణ చేసి ధ్రువీకరణ చేసి సొసైటీలో అందజేస్తున్న రిపోర్టుతో తేటతెల్లమైంది.