గిరిజన నృత్యంలో పాలుపంచుకున్న ఎమ్మెల్యే..

by Disha Web Desk 20 |
గిరిజన నృత్యంలో పాలుపంచుకున్న ఎమ్మెల్యే..
X

దిశ, గాంధారి : కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో గిరిజనులు హోలీ లెంగి ఉత్సవాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జగదాంబ మాత, సేవలాల్ మహారాజ్ గుడి దగ్గర బంజారా సాంప్రదాయ నృత్యమైన హోలీ లెంగీ గిరిజన సంప్రదాయ నృత్యంలో గిరిజనులతో పాటు అందరు చిందులు డీజే పాటలకు చిందులు ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ గిరిజన సాంప్రదాయ దుస్తులు ధరించి నృత్యం చేశాడు. అలాగే వివిధ రాజకీయ నాయకులు కూడా గిరిజన సాంప్రదాయ దుస్తులు ధరించి నాట్యం చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహాశివరాత్రి నుండి దాదాపు 15 రోజులు పౌర్ణమి ఉపవాస దీక్షతో ఉండి జరుపుకునే లింగీ పండగలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. అనంతరం వివిద రాజకీయ నాయకులు మాట్లాడుతూ గిరిజనులు వారి ముఖ్యపండుగలో ఒకటైన హోలీ లెన్గి పండుగకు వారి ఆహ్వానించి ఆతిథ్యం ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని తమ ఆనందం వ్యక్తం చేశారు. పలువురు ప్రముఖులు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే, ప్రముఖ ఉత్తమ డాక్టర్ అవార్డు పొందిన రాంసింగ్, భాజపా,కాంగ్రెస్, భారాసా రాజకీయ నాయకులు, వివిధ గ్రామాల నుంచి సర్పంచులు, ఉప సర్పంచ్లు, వార్డ్ మెంబర్లు బంజార సోదరీ సోదరీమణులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Next Story

Most Viewed