జల్సాలకు అలవాటు పడి అలా చేశారు..

by Sumithra |
జల్సాలకు  అలవాటు పడి అలా చేశారు..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే కాస్ట్లీ బీఎస్ 6, బీఎస్ 4 బైకులను దొంగలించి విక్రయిస్తున్న ముఠాను పట్టుకున్నట్లు పోలీస్ కమిషనర్ కే.ఆర్. నాగరాజు తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ మాట్లాడారు. నిజామాబాద్ నగరంలోని హష్మీ కాలనీకి చెందిన సమదుధ్ధీన్, మహ్మదీయ కాలనీకి చెందిన షేక్ రియాజ్ లు ఇద్దరు డ్రైవర్ లుగా పనిచేస్తూ నగరంలో ఇండ్లలో దొంగతనాలకు పాల్పడి జైలుకు వెళ్లారు. జైలు నుంచి విడుదలైన తర్వాత జల్సాలకు అలవాటు పడి, డబ్బులు సులువుగా సంపాదించాలని బైక్ ల చోరీలకు పాల్పడ్డారు.

నగరంలో కొత్తగా మార్కెట్ లోకి వచ్చిన బుల్లెట్ వాహనాలు, యాక్టివా వాహనాలను టెక్నిక్ తో సైకిల్ పూల్లలను ఉపయోగించి తాళాలను సులువుగా తెరిచి దొంగిలించారు. బాన్సువాడ పట్టణం తాడ్ కోల్ కు చెందిన టూ వీలర్ ఫైనాన్స్ వ్యాపారి, హైదరాబాద్ శాస్త్రిపురం కాలనీకి చెందిన అద్నాన్ బిన్ ఉమర్ ముసల్లితో కలిసి దొంగిలించిన కొత్త వాహనాలను మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో, కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో వాహనాలను విక్రయించారు. వచ్చిన డబ్బులతో వస్త్రాలు కొనుగోలు చేసి జల్సాలు చేసేవారు. దానికి తోడు బాన్సువాడ పట్టణంలో తాడ్ కోల్ లో వచ్చిన సొమ్ముతో ఇల్లు నిర్మించుకున్నారు.

ఇటీవల పోలీసు శాఖ పై బైకుల చోరీ విషయంలో వచ్చిన ఒతిళ్ళ నేపద్యంలో డీసీపీ అరవింద్ బాబు పర్యవేక్షణలో, నిజామాబాద్ ఏసీపీ వెంకటేశ్వర్, 2వ టౌన్ ఎస్ఐ పూర్ణేశ్వర్, సిబ్బందితో కలిసి విచారణ చేపట్టారు. అందులో భాగంగా పాత నేరస్తులైనా షేక్ సమీదుద్దీన్, షేక్ రియాజ్ లను అదుపులోకి తీసుకొని 11 రాయల్ ఎన్ ఫీల్డ్, 18 యాక్టివా బైక్ లు, 8 పల్సర్ లు, 8 షైన్, 3 బార్గ్ మ్యాన్ బైక్ లను రికవరీ చేశారు. ఈ కేసును చేదించి 72 లక్షల విలువైన బైక్ లను రికవరీ చేసి నిజామాబాద్ పోలీసుశాఖకు సక్సెస్ రేషియో పెంచారని వారికి క్యాష్ రివార్డులు, ప్రశంస పత్రాలను పంపిణీ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో డీసీపీ అరవింద్ బాబు, ఏసీపీ వెంకటేశ్వర్, సీఐ శ్రీశైలం, సీసీఎస్ సీఐ రాజశేఖర్, ఎస్ఐ పూర్నేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed