ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో 3.5 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

by Kalyani |
ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో 3.5 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
X

దిశ, ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి మున్సిపాలిటీ లోని ఒకటో వార్డు, మూడో వార్డులకు సంబంధించిన 3.5 కోట్ల నిధులతో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాబోయే రోజులో మిగతా వార్డ్ లో కూడా అభివృద్ధి పనులు ప్రారంభిస్తాం అని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఎల్లారెడ్డి నియోజకవర్గం మున్సిపాలిటీనీ వీలైన మరిన్ని నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నాం అని తెలిపారు. ఎల్లారెడ్డి పట్టణంలో 4.5 కోట్లతో ఎల్లారెడ్డి పెద్ద చెరువును మినీ ట్యాంక్ బండ్ గా తీర్చిదిద్దడానికి పనులు జరుగుతున్నాయి అని ఎమ్మెల్యే అన్నారు.

ఎల్లారెడ్డి పట్టణంలో ఉన్న పురాతన బావిని అభివృద్ధి చేసి ఎల్లారెడ్డి పట్టణాన్ని పర్యాటక కేంద్రంగా ఏర్పాటుకు కృషి చేస్తున్నాం అని తెలిపారు. ఎల్లారెడ్డి నియోజకవర్గం గత పాలకుల పాలనలో ఎంతో వెనుకబడిపోయిందని ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి తన లక్ష్యమని నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉన్నారని ఎమ్మెల్యే మదన్ మోహన్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కురుమ సాయిబాబా, ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని ఆయా మండల పార్టీ అధ్యక్షులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.Next Story

Most Viewed