- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
రైతు సంక్షేమమే భారాస లక్ష్యం : ఎమ్మెల్యే సురేందర్
by Disha Web Desk 15 |

X
దిశ, గాంధారి : రైతుల సంక్షేమమే భారత రాష్ట్ర సమితి లక్ష్యమని, రైతుల కోసం అహర్నిశలు కేసీఆర్ పాటుపడుతున్నారని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్ అన్నారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలోని గండివేట్ గ్రామంలో నూతన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంను శుక్రవారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గండిపేట్ గ్రామంలో ఏర్పాటు చేసిన నూతన ప్రాథమిక వ్యవసాయ సొసైటీ భవనాన్ని 43 లక్షలతో నిర్మించామని, సీతాయపల్లి గిడ్డంగికి 15 లక్షల రూపాయలు, ముదెల్లిలో నిర్మించిన వ్యవసాయ గిడ్డంగికి 15 లక్షల రూపాయలు కేటాయించినట్టు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట మండల సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Next Story