ఆసరా.. ఊసే లేదు..

by Sumithra |
ఆసరా.. ఊసే లేదు..
X

దిశ, ఎల్లారెడ్డి : తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆసరా పథకం కింద అర్హులకు పింఛన్లు అందకపోవడం. ఈ పథకం కింద అర్హులకు సకాలంలో పింఛన్లు అందకపోవడంతో ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఆసరా పథకం వివరాలలోకి వెళితే తెలంగాణ ప్రభుత్వం పేదలకు సురక్షితమైన జీవితాన్ని అందించడానికి ఆసరా పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద వృద్ధులు, వితంతువులు, గౌడ్‌లు, ఏనుగు వ్యాధిగ్రస్తులు, ఎయిడ్స్‌ బాధితులు, శారీరక వికలాంగులు వంటి వారికి పింఛన్లు ఇస్తారు.

అర్హులకు అందని ఆసరా.. రెండున్నరేళ్లుగా లబ్ధిదారుల ఎదురుచూపులు..

ప్రభుత్వ ప్రతిష్టాత్మక ‘ఆసరా’ పింఛను పథకం అర్హులకు అందడం లేదు. మండల, పంచాయతీ కార్యాలయాల్లో నిబంధనల ప్రకారం లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు తీసుకుని, పరిష్కరించినా పింఛన్‌ బ్యాంకు ఖాతాల్లోకి రాలేదు. ఇటీవల వృద్ధాప్య పింఛన్ అర్హత, వయసు తగ్గించాక స్వీకరించిన 7.8 లక్షల దరఖాస్తుల పరిశీలన ఇప్పటికీ మొదలుకాలేదు. దీంతో ఎంతో మంది వృద్ధులు, వితంతువులు ఎదురుచూస్తున్నారు.

రాష్ట్రంలో ఆసరా పింఛన్ల కోసం ఎంతో మంది వృద్ధులు, వితంతువులు ఎదురుచూస్తున్నారు. 65 ఏళ్లు దాటిన వారికి, ఇంటి పెద్దను కోల్పోయి ఆసరా కోసం దరఖాస్తు చేసిన వారికి కూడా రెండున్నరేళ్లుగా పింఛన్లు మంజూరు కావడం లేదు. మండల, పంచాయతీ కార్యాలయాల్లో నిబంధనల ప్రకారం లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు తీసుకుని, పరిష్కరించినా పింఛను బ్యాంకు ఖాతాల్లోకి రాలేదు. ఇటీవల వృద్ధాప్య పింఛన్ అర్హత, వయసు తగ్గించాక స్వీకరించిన 7.8 లక్షల దరఖాస్తుల పరిశీలన ఇప్పటికీ మొదలుకాలేదు. వృద్ధాప్య పింఛన్లకు గతంలో అర్హత వయసు 65 ఏళ్లుగా ఉంది. వితంతువులు, దివ్యాంగులకు వయసుతో సంబంధం లేకుండా లబ్ధి చేకూర్చుతోంది. 65 ఏళ్లు దాటిన వృద్ధులతో పాటు వితంతువులు ఆసరా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు.

వారి వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి మంజూరు పత్రాలు ఇచ్చారు. అయితే రెండున్నరేళ్లుగా దరఖాస్తులు తీసుకుని, పింఛను పొందేందుకు అర్హత కల్పించినప్పటికీ నిధులు మంజూరు కాలేదు. 2019 నుంచి ఇదే పరిస్థితి నెలకొంది. గత రెండేళ్లలో పింఛనుకు అర్హత పొందిన లబ్ధిదారులు దాదాపు లక్ష మందికి పైగా ఉంటారని అంచనా. నెలకు రూ. 2,016 వస్తే అనారోగ్య అవసరాలు తీరుతాయని ఆశిస్తున్నారు. మరోవైపు వృద్ధాప్య పింఛన్లకు అర్హత 57 ఏళ్లకు తగ్గించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టులో తొలుత 7.4 లక్షల దరఖాస్తులు వచ్చాయి. గత నెలలో మరోసారి అవకాశమివ్వడంతో మరో 40 వేల వరకు వచ్చినట్లు తెలిసింది. వీటిని ఎప్పటి నుంచి పరిష్కరించాలో గ్రామీణాభివృద్ధి శాఖ నిబంధనలు, గడువును వెల్లడించలేదు. అర్హత వయసు తగ్గించాక కొత్తగా వచ్చిన 7.8 లక్షల దరఖాస్తుల్లో.. 65 ఏళ్లు దాటిన వారు కూడా ఉన్నారు.

రాష్ట్రంలో ప్రస్తుతం 37.48 లక్షల మంది వివిధ పింఛన్లు తీసుకుంటున్నారు. దివ్యాంగులకు నెలకు రూ. 3,016, ఇతర కేటగిరీల వారికి ఆసరా పింఛన్ల కింద నెలకు రూ. 2,016 పింఛను అందుతోంది. దీని కోసం నెలనెలా ప్రభుత్వం రూ.1,000 కోట్లు వెచ్చిస్తోంది. గత రెండున్నరేళ్లుగా అర్హత పొందినా పింఛన్లు పొందలేకపోయిన లబ్ధిదారులు, కొత్తగా దరఖాస్తు చేసిన వారిని పరిగణలోకి తీసుకుంటే నెలకు రూ. 180 కోట్లు అదనంగా అవసరమని అంచనా, పింఛను కోసం ఎదురు చూపులు.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లు కొత్తవి రాకపోవడంతో ఆసరా అందక ఎంతో మంది తమ భర్తలను కోల్పోయిన అర్హులైన వితంతువులు ఇబ్బందుల పాలవుతున్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి, నియోజకవర్గంలో ఎంతోమంది భర్తలను కోల్పోయిన మహిళలను వందల సంఖ్యలో ప్రభుత్వ కార్యాలయాల్లో చెప్పు తిరిగి మండల పరిషత్ కార్యాలయంలో దరఖాస్తులు అందించి ఆసరా కోసం అలసిపోతున్నారు. చిన్నతనంలోనే భర్తలను కోల్పోయి కనీసం పిల్లలు పోషించుకోవడానికి కాస్త ఆసరవుతుందేమోనని ప్రభుత్వం వైపు ఎదురుచూసి అలసిపోయి విసిగిపోతున్నారు.

Advertisement
Next Story