స్పీకర్ పోచారం ఇలాకాలో ముదిరిన డబుల్ లొల్లి

by Disha Web Desk 12 |
స్పీకర్ పోచారం ఇలాకాలో ముదిరిన డబుల్ లొల్లి
X

దిశ, కోటగిరి: నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం పోతంగల్ గ్రామాలలో ప్రభుత్వం 44 డబుల్ బెడ్ రూమ్‌ ఇల్లను నిర్మించారు. వాటిని గతంలో టీఆర్ఎస్ నాయకులు అధికారులకు ప్రమేయం లేకుండా సాయంత్రం పూట లబ్ధిదారులను ఎంపిక చేసి ఇండ్లు పంపిణీ చేయగా అందులో 44 వ నెంబర్ ఇంటిని ఎవరికి అలర్ట్‌మెంట్ చేయలేదు. ఈ ఇంటి కోసం చాలా మంది ఆశభావులు అధికారుల చుట్టూ, రాజకీయ నాయకులు చుట్టూ తిరిగిన తమకు న్యాయం జరగడం లేదని, కొంత్తుల నాగయ్య తన కుటుంబంతో సహా వచ్చి 44వ నెంబర్ ఇంట్లో నివాసం ఉంటున్నాడు. కాగా అతని ఇంటి నుంచి ఖాళీ చేయించడం కోసం శనివారం రోజు తహశీల్దార్ శ్రీకాంత్ రావు పోలీసు బలగాలతో వచ్చి ఖాళీ చేయించేందుకు ప్రయత్నించారు.

దీంతో కొంత్తుల నాగయ్య రెండవ కుమారుడు నాందేవ్ అధికారులు తమను ఇంటి నుంచి ఖాళీ చేపిస్తున్నారని మనస్తాపంతో ఆత్మహత్య యత్నం చేశాడు. దీంతో అప్రమత్తమైన అధికారులు విద్యుత్ అధికారులకు సమాచారం అందించి పవర్ కట్ చేయించారు. అనంతరం అధికారులు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కి సమాచారం అందించారు. దీంతో స్పీకర్ సర్వే నిర్వహించి నిజమైన లబ్దిదారునికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేయవలసిందిగా ఆదేశించారు. దీంతో అధికారులు సర్వే నిర్వహించిన అనంతరం డబుల్ బెడ్ రూమ్ ఇంటికి అర్హుడని గుర్తించి బాధితుడికె ఇంటిని కేటాయిస్తామని, తహశీల్దార్ శ్రీకాంత్ రావు స్పష్టం చేశారు.



Next Story

Most Viewed