- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
అధికారుల నిర్లక్ష్యంతో ఎండుతున్న పంటలు..
by Sumithra |

X
దిశ, బాన్సువాడ : నస్రుల్లాబాద్ మండలంలోని మిర్జాపూర్ గ్రామ శివారులో నీరు అందక పంట పొలాలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజాంసాగర్ నీరు 3 విడతలు విడిచిన తమ పొలాలకు ఇప్పటి వరకు నీరు అందలేదని రైతులు చెప్తున్నారు. నిజాంసాగర్ నీరు ఉపకాలువ ద్వారా చెరువు నింపితే తమ పంటలు ఎండకుండా ఉంటాయని రైతులు చెప్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంతో చెరువు వరకు నీరు రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పై అధికారులు, నాయకులు స్పందించి చెరువు నింపి తమ పంటలను కాపాడాలని రైతులు మాడ మారుతి, జంగిలి శ్రీనివాస్ లు కోరుతున్నారు.
Next Story