బిచ్కుందలో ఘనంగా ప్రారంభమైన క్రిస్మస్ వేడుకలు

by Gopi |
బిచ్కుందలో ఘనంగా ప్రారంభమైన క్రిస్మస్ వేడుకలు
X

దిశ, బిచ్కుంద: కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని క్రైస్తవ ప్రార్థన మందిరాలలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా జుక్కల్ మాజీ ఎమ్మెల్యే గంగారం హాజరయ్యారు. ఈ సందర్భంగా పాస్టర్ బ్రదర్ శైలేష్ కుమార్ మాట్లాడుతూ క్రిస్మస్ పండుగ అత్యంత పవిత్రమైనదని, లోకరక్షకుడైన ఏసుక్రీస్తు పుట్టినరోజుని ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా జరుపుకోవాలన్నారు. ఈ వేడుకల్లో వివిధ గ్రామాల క్రైస్తవులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed