- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఈ దేశానికి ,రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ శ్రీరామరక్ష: మంత్రి జూపల్లి
దిశ, మద్నూర్: ఈ దేశానికి కానీ ఈ రాష్ట్రానికి కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు శ్రీరామరక్ష అని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మద్నూర్ మండల కేంద్రానికి మంజూరైన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణానికి 305 కోట్లు మంజూరు కాగా పాఠశాల నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం మద్నూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవం మండల కేంద్రంలోని గురు ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మంత్రి సమక్షంలో మద్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా సౌజన్య, రమేష్ వైస్ చైర్మన్ గా, పరమేష్, పలువురు డైరెక్టర్లకు వ్యవసాయ మార్కెట్ కమిటీ జిల్లా అధికారి రమ్య ప్రమాణస్వీకారం జరిపించారు. అనంతరం మంత్రి జూపల్లి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రంలో గాని దేశంలో గాని కాంగ్రెస్ పార్టీ పాలననే ప్రజలకు శ్రీరామరక్ష అని కొని ఆడారు. రాష్ట్రంలో గత ప్రభుత్వం 10 సంవత్సరాలు పాలించి దుర్మార్గ పాలన కొనసాగించాలని లక్షల రూపాయలు అప్పు చేయడం వారు చేసిన అప్పులకే మిత్తి భారమైందని తెలిపారు.
ప్రమాణ స్వీకారం చేసిన మార్కెట్ కమిటీ పాలక వర్గానికి పలు సూచనలు చేశారు ప్రమాణం చేసిన వారు ప్రజలకు న్యాయం అయ్యే విధంగా పాలన కొనసాగించాలని మార్కెట్ కమిటీ అభివృద్ధికి పాటుపడాలని సూచించారు ఈ కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు, జహీరాబాద్ ఎంపీ సురేష్, షెట్కార్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ సౌజన్య, రమేష్ వైస్ చైర్మన్ పరమేష్ , పటేల్, మార్కెట్ కమిటీ జిల్లా అధికారి రమ్య జిల్లా కలెక్టర్ సాంగ్వన్, అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, జిల్లా విద్యాశాఖ అధికారి రాజు టీజీ ఈ డబ్ల్యు హైడీసీ అధికారులు ఎస్ ఈ జె నాగ శేషు దిప్టి సాయన్న ఏఈ నాగేశ్వరరావు మండల తహసీల్దార్ ఎండి ముజీబ్, ఎంపీడీవో రాణి, ఎంపీవో వెంకట నరసయ్య, ఎంఈఓ రాములు నాయక్, ఏపీఎం రవీందర్ ఏపీవో పద్మ మార్కెట్ కమిటీ సెక్రటరీ రామ్నాథ్, సూపర్వైజర్ రామ్ చందర్ జుక్కల్ నియోజకవర్గం లోని ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, వివిధ శాఖల అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.