గణపతికి వినతిపత్రం అందజేసిన సమగ్ర శిక్ష ఉద్యోగులు..

by Sumithra |
గణపతికి వినతిపత్రం అందజేసిన సమగ్ర శిక్ష ఉద్యోగులు..
X

దిశ, నిజామాబాద్ సిటీ : తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం నిజామాబాద్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ చౌరస్తాలో గల ధర్నా చౌక్ లో రిలేనిరాహార దీక్షలు 17వ రోజు చేరుకున్నాయి. సమగ్ర శిక్షా ఉద్యోగులను రెగ్యులర్ అయ్యేందుకు ఉన్న విఘ్నాలు తొలగించాలని కోరుతూ గణపతికి వినతి పత్రం అందజేశామని ప్రధాన కార్యదర్శి రాజు అన్నారు. 17 రోజులుగా ప్రతిరోజు ఏదో ఒక వినూత్న కార్యక్రమాలు చేస్తూ ప్రభుత్వానికి మా సమస్యల గురించి విన్నవిస్తూ ఉన్నామని తెలిపారు.

కానీ నేటి వరకు ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన పిలుపు రాలేదన్నారు. నేడు వినాయక చవితి సందర్భంగా దీక్షా శిబిరంలోనే వినాయకుని ప్రతిష్టించి పూజలు చేసి భజనలు చేసి సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు తీర్చే విధంగా సీఎం కేసీఆర్ మనసు మార్చాలని, తమ రెగ్యులరైజేషన్ కు గల విఘ్నాలు తొలగించాలని వినాయకునికి వినతిపత్రం అందజేసి ఆ వినాయకుని ప్రార్థించామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జేఏసీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు దిలీప్ రాజు, అంజయ్య, అంబదాస్ రావు పాల్గొన్నారు.



Next Story

Most Viewed