నిజామాబాద్ పోలిస్ లపై జాతీయ బీసీ కమీషన్ చైర్మెన్ కు ఫిర్యాదు

by Disha Web Desk 20 |
నిజామాబాద్ పోలిస్ లపై జాతీయ బీసీ కమీషన్ చైర్మెన్ కు ఫిర్యాదు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : రాష్ర్ట మంత్రి కేటిఆర్ పర్యటన సంధర్బంగా బిజేవైయం నాయకులపై నిజామాబాద్ పోలిస్ లు వ్యవహరించిన తీరుపై జాతీయ బీసీ కమీషన్ లో ఫిర్యాదు చేశారు బిజేవైయం నాయకులు. ఆదివారం డిల్లీలో నిజామాబాద్ ఎంపీ ధర్మపూరి అరవింద్ తో కలిసి బిజేవైయం రాష్ర్ట కార్యదర్శి, 35 వ డివిజన్ కార్పొరేటర్ ఎర్రం సుధీర్ జాతీయ బీసీ కమీషన్, కమీషన్ చైర్ పర్సన్ హన్సరాజ్ గంగారం అహిర్ కు ఫిర్యాదు చేశారు.

గత నెల 28న రాష్ర్ట మున్సిపల్ మంత్రి కేటిఆర్ పర్యటన సందర్బంగా రాష్ర్ట ప్రభుత్వం ఇచ్చిన నిరుద్యోగ భ్రుతి హమీని నేరవేర్చాలని బీజేవైయం నాయకులు మంత్రి కేటిఆర్ కాన్వాయ్ ను అడ్డుకున్నారు. పోలిస్ లు వారిని అడ్డుకుని లాఠిలు ఝూలిపించారు. వారిపై కేసులు నమోదు చేసి రిమాండ్ కు పంపారు. ఈ కేసులో జైలు నుంచి బేయిల్ పై విడుదలైన తరువాత తమపై జరిగిన దాష్టికంపై నిజామాబాద్ పోలిస్ లపై జాతీయ బిసి కమీషన్ లో పిర్యాదు చేయడం విశేషం. బిసీ కమీషన్ చైర్ పర్సన్ ను కలిసి వారిలో బీజేవైయం నాయకులు ఇందూర్ సాయి, కార్తీక్, మహేష్ తదితరులు ఉన్నారు.



Next Story