శిలాఫలకం తెచ్చిన గొడవ..

by Disha Web Desk 20 |
శిలాఫలకం తెచ్చిన గొడవ..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలో రెండు గ్రామాల మధ్య నిర్మించిన వంతెన ప్రారంభం కోసం ఎర్పాటు చేసే శిలాఫలకం విషయంలో జరిగిన గొడవ ఘర్షణకు దారి తీసింది. తమ గ్రామ రెవెన్యూ పరిధిలో శిలా పలకం వద్ధని ఒక గ్రామం, అక్కడే ఎర్పాటు చేసితిరుతామని ఎర్పాటు చేసిన మరో గ్రామం. స్థానిక అధికార పార్టి ఎమ్మెల్యే చేతుల మీదుగా వంతెనను ప్రారంభించి వెళ్లిపోయారో లేదో ఒక గ్రామానికి చెందిన యువకులను మరో గ్రామానికి చెందిన వారు కొట్టారు. దాన్ని ప్రశ్నించేందుకు వెళ్లిన వారితో జరిగిన గోడవ రెండు గ్రామాల మధ్య ఘర్షణకు దారి తీసింది. ఆదివారం నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ఇందల్వాయి మండలం లోలం- మల్లాపూర్ గ్రామల మధ్యన కొత్తగా కట్టిన బ్రిడ్జిని రూరల్ ఎమ్మెల్యేబాజిరెడ్డి గోవర్ధన్ ప్రారంభించారు.

గత కొంత కాలంగా అక్కడ శిలాపలకం విషయంలో లోలం మల్లాపూర్ గ్రామాస్ధులు గొడవపడుతున్నారు. ఈ విషయంలో ఎమ్మెల్యే సర్థి చెప్పిన లోలం గ్రామస్ధులు వినలేదు. మార్గం బ్రిడ్జీ మధ్యలో శిలా పలకం ఎర్పాటు చేయాలని సూచించారు. కాని లోలం గ్రామస్థులు మల్లాపూర్ రెవిన్యూ పరిధిలో శిలాపలకం ఎర్పాటు చేసి ఎమ్మెల్యేను పిలిపించి ప్రారంభింపచేశారు. ఎమ్మెల్యే వెల్లిపోగానే మల్లాపూర్ గ్రామానికి చెందిన యువకులు వ్యవసాయ పనుల కోసం వెల్లగా లోలం గ్రామానికి చెందిన వారు కొట్టారు. ఈ విషయం తెలిసి మల్లాపూర్ గ్రామంవారు ప్రశ్నించేందుకు వెళ్లగా రెండు గ్రామాల వారి మద్య జరిగిన గొడవ ఘర్షణ దారితీసింది. దానితో కర్రలతో దొరికిన రాళ్లు ఒకరి పై ఒక్కరు విసురుకున్నారు. దానితో పోలిస్ లు రంగ ప్రవేశం చేసి రెండు గ్రామాల గ్రామస్థులను చెదరగొట్టారు.


Next Story

Most Viewed