చైనా మాంజాకు.. చెక్ పడేనా?

by Mahesh |
చైనా మాంజాకు.. చెక్ పడేనా?
X

దిశ, నవీపేట్: సంక్రాంతి పండుగ అంటేనే పిల్లా పాపలు సకల పరివారంతో ఆనందంగా గడిపే పండగ. అటువంటి పండుగ సందర్భంగా పిల్లలు పెద్దలు ఆకాశంలో ఆనందంగా గాలి పటాలను ఎగిరేస్తూ తమ ఆనందాలు ఆకాశానికి అందినట్లు ఆహ్లాదంలో మునిగిపోతుంటారు. పండుగకు నెల రోజుల ముందు నుంచే ఆదివారం, ఇతర సెలవు రోజుల్లో పిల్లలు పతంగులు ఎగురవేస్తూ సందడి చేస్తుంటారు. గ్రామాలు పట్టణాలు అనే తేడా లేకుండా పోటీపడుతూ డీల్ వేస్తూ గాలిపటాలు ఎగురవేస్తుంటారు. అటువంటి పండుగలో అతి ప్రమాదకరంగా ఉండే చైనా మాంజ చోటు చేసుకోవడంతో పిల్లలు, పెద్దల ప్రాణాలతో చెలగాటమాడినట్లు అవుతుంది. చైనా మాంజా తో పిల్లల చేతులతో పాటు గొంతులు సైతం తెగడంతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. గత సంవత్సరం చైనా మాంజ కోసుకుని గాయపడిన ఘటనలు జిల్లాలో చోటుచేసుకున్నాయి. హైదరాబాద్ లో బైక్ పై డ్యూటీ కి వెళ్తున్న

ఉద్యోగి మెడను చైనా మాంజ కోసుకోవడం తో మృతి చెందిన సంగతి తెలిసిందే. నవీపేట్ మండలంలోని అబ్బాపూర్ గ్రామంలో సైకిల్ పై వెళుతున్న సత్యరాజ్ అనే 4వ తరగతి కి చెందిన బాలుడికి చైనా మాంజ మెడకు చుట్టుకుని గొంతు కోసుకోవడం తో ఆసుపత్రిలో చికిత్స పొంది ప్రాణాలతో బయటపడ్డాడు. చైనా మాంజ కారణంగా మనుషులే కాకుండా ఆకాశంలో స్వేచ్ఛగా ఎగిరే పక్షులు సైతం ప్రమాదాల బారిన పడుతున్నాయి. చైనా మాంజా లను ప్రభుత్వం నిషేధించిన జిల్లాలో అమ్మకాలు చేస్తుండడంతో చిన్నారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. కాబట్టి అధికార యంత్రాంగం స్పందించి ఈ సంక్రాంతి కైనా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా చైనా మాంజా కి చెక్ పెట్టి ప్రాణాలను కాపాడాలని సామాజిక కార్యకర్తలు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed