పండగపూట విషాదం

by Dishanational1 |
పండగపూట విషాదం
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: పండగపూట నాగుపాము ఓ కుటుంబంలో విషాదం నింపింది. నాలుగేళ్ల చిన్నారిని నాగుపాము కాటు వేయడంతో చిన్నారి మృతి చెందింది. దీంతో గ్రామమంతా శోక సముద్రంలో మునిగిపోయింది. గ్రామస్తులందరిని కంటతడి పెట్టించిన ఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలోని గన్నారం గ్రామానికి చెందిన చాకలి కలికోట గంగాధర్ కూతురు కలిగోట అమూల్య(4) శ్రీరామనవమి సందర్భంగా సెలవు ఇవ్వడంతో ఇంటిముందు ఆడుకుంటుంది. అకస్మాత్తుగా నాగుపాము కాటు వేయడంతో హాస్పిటల్ కి తరలిస్తుండగా మార్గ మధ్యలో అమూల్య తుది శ్వాస విడిచింది. ఈ మరణ వార్త విన్న కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు, బంధుమిత్రులు శోకసముద్రంలో మునిగిపోయారు. శ్రీరామనవమి పండుగ పూట నాగుపాము కాటుకు తమ చిన్నారి ప్రాణాలు వదిలిందని కుటుంబీకులు రోధిస్తూ వాపోయారు.


Next Story

Most Viewed