చంద్రబాబు నాయుడి అరెస్టు దారుణం

by Disha Web Desk 15 |
చంద్రబాబు నాయుడి అరెస్టు దారుణం
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అరెస్టు దారుణం అని నిజామాబాద్ జిల్లా బోదన్ ఎమ్మెల్యే షకిల్ అమేర్ అన్నారు. మంగళవారం బోధన్ పట్టణంలోని అచన్ పల్లి ఏ ఆర్ గార్డెన్ లో దివ్యంగులకు ఆసరా పెన్షన్ రూ.3016 నుండి 4016 రూపాయలకు పెంచిన చెక్కులను అందజేసి మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ లో మంచి పరిపాలన అందించిన మాజీ ముఖ్యమంత్రి ని అరెస్ట్ చేసి దౌర్జన్యంగా జైల్ లో పెట్టడం లాంటి పనులు తెలంగాణలో బీఆర్ ఎస్ ప్రభుత్వం చేయలేదని అన్నారు. తెలంగాణ వస్తే కేసీఆర్ సెటిలర్స్ను చంపేస్తారు, తరిమేస్తారు అన్నారని కానీ ప్రతి వర్గానికి అండగా నిలిచారన్నారు.


Next Story