- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
తల్వార్ తో ఓ యువకుడి జన్మదిన వేడుకలు
దిశ ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మండలంలోని అంకాపూర్ గ్రామంలో ఓ మైనారిటీ యువకుడు తల్వార్ తో జన్మదిన వేడుకలు చేసుకున్నాడు. జిరాయత్ నగర్ కు చెందిన మైనారిటీ యువకుడు ఉమర్ తల్వార్ తో కేక్ కట్ చేస్తున్న..వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ వేడుకలు ఆగస్టు నెల 28వ తేదీన అంకాపూర్ గ్రామంలోని జాతీయ రహదారి ప్రక్కన జరుపుకున్నట్లు తెలిసింది. మైనారిటీ యువకులు హల్చల్ చేస్తూ తల్వార్ తో కేక్ కట్ చేసి నిర్వహించిన పుట్టినరోజు వేడుకల విషయాన్ని ఆగస్టు నెల నెలలోనే ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి వివరించి..మరొకరు ఇలాంటి పనులు ఆర్మూర్ లో చేయవద్దని మందలించినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ విషయంపై జిల్లా పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ వరకు కూడా ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి వెళ్లి యువకులపై ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఇటీవల జరిగిన గణేష్ నిమజ్జనోత్సవంలో పలువురు గణేష్ మండపాల యువకులు మితిమీరిన డీజే శబ్దాలను పెట్టుకుని ఆర్మూర్ ప్రాంత ప్రజలకు ఇబ్బందికర వాతావరణం సృష్టించిన విషయం అందరికీ తెలిసిందే. కాగా ఈ నేపథ్యంలో గణేష్ నిమజ్జనోత్సవం కార్యక్రమం అనంతరం రెండు మూడు రోజుల్లోనే గణేష్ నిమజ్జోత్సవంలో ఇబ్బందులు కలిగించిన యువకులను ఆర్మూర్ పోలీస్ స్టేషన్ కు పిలిచి.. కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ విషయం తెలుసుకున్న ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఎస్ హెచ్ ఓ ఫోన్ చేసి..మత రాజకీయాలు చేయడం మానుకోవాలని, అందరికీ అన్ని మతాల వారికి ఒకే విధంగా శాంతి భద్రతల పరిరక్షణ చేయాలని ఎమ్మెల్యే ,ఎస్ హెచ్ ఓ పై ఫైర్ అయ్యారు. తల్వార్ తో పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న మైనారిటీ యువకులపై ఇంతవరకు చర్యలు తీసుకోవడంలో ఒక తీరుగా..గణేష్ నిమజ్జోత్సవంలో ఇబ్బందులు కలిగించిన హిందూ యువకులకు ఒక తీరుగా చూడడం ఏంటని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.