సర్కార్ క్రీడా స్థలంలో పశువులు.. మరి యువకులు ఎక్కడా?

by Dishanational2 |
సర్కార్ క్రీడా స్థలంలో పశువులు.. మరి యువకులు ఎక్కడా?
X

దిశ, పిట్లం : సర్కారు క్రీడా స్థలం పశువుల సంతగా మారింది. పిట్లం మండల కేంద్రంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఆనవాయితీగా ఎడ్ల బజార్ నిర్వహిస్తారు. కాగా, రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలో ఉన్న యువకుల కొరకు క్రీడా ప్రాంగణాలు గుర్తింపు చేయాలని ఆదేశాలు రాగా, ఉన్నతాధికారులు ఎడ్ల బజార్‌ను ఎంపిక చేశారు. కాంట్రాక్టర్ ప్రత్యామ్నాయంగా ప్రాంగణంలోనే ఎడ్ల బజార్ నిర్వహిస్తున్నారు. మండల అధికారులకు ముందు చూపు లేకపోవడమే దీనికి నిదర్శనమని తెలుస్తోంది. దీనికి తోడుగా దళిత సంఘాలు కమ్యూనిటీ భవనాలకు స్థలం కేటాయించాలని ధర్నా కూడా చేశారు. అధికారులు సర్వే చేసి దళిత సంఘాలకు స్థలం కేటాయిస్తామని చెప్పి ఇప్పటివరకు ఎలాంటి సర్వే నిర్వహించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి ఎడ్ల బజార్‌కు వేరే స్థలం కేటాయిస్తే విద్యార్థులు క్రీడా ప్రాంగణంలో ఆటలు ఆడుకునేందుకు అనుగుణంగా ఉంటుందని ప్రజలు కోరుతున్నారు.


Next Story

Most Viewed