- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
'మా ప్రభుత్వంలో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంది'

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ నగరం శాంతి భద్రతల సమస్యలు లేవు. శివారు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి రోడ్లు, డ్రైనేజీలు, కల్వర్టులు నిర్మించి వీధి లైట్లు ఏర్పాటు చేయడంతో రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందిందని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గణేష్ బిగాల అన్నారు. సోమవారం నిజామాబాద్ నగరంలో బోధన్ రోడ్డులోని ఎంపిరియల్ గార్డెన్‌లో సహారా రియల్ ఎస్టేట్ అసోసియేషన్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టి ఎమ్మెల్యే అభ్యర్థిగా గణేష్ బిగాల హజరై మాట్లడారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంది అన్నారు.
నిజామాబాద్ నగరంలో సామాన్య ప్రజలు రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెడుతున్నారు అన్నారు. రియల్ ఎస్టేట్ అసోసియేషన్ సభ్యులు భవనం నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరగా తప్పకుండా మీ సమస్యలు పరిష్కారం చేస్తాను అన్నారు. మీరంతా మరోసారి కారు గుర్తుకి ఓటు వేసి.. దీవిస్తే మరింత అభివృద్ధి చేస్తానని మాటిస్తున్నాను అన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్కో మాజీ చైర్మన్ అలీం, మాజీ డిప్యూటీ మేయర్ మాజాజ్ అలీ, నవీద్ ఇక్బల్, అబ్దుల్ కుద్దుస్, మతీన్ రియల్ అసోసియేషన్ సభ్యులు ఖలీమ్, అబేద్, అబ్రార్, అలీం తదితరులు పాల్గొన్నారు.