తెలంగాణలో 10 పార్లమెంటు స్థానాల్లో బీజేపీ గెలుస్తుంది

by Disha Web Desk 15 |
తెలంగాణలో 10 పార్లమెంటు స్థానాల్లో బీజేపీ గెలుస్తుంది
X

దిశ, నిజామాబాద్ : రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీ తెలంగాణ రాష్ర్టంలో అత్యధిక స్థానాల్లో గెలిచి అతి పెద్ధ పార్టీగా ఆవిర్భవిస్తుందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ జోష్యం చెప్పారు. మంగళవారం నిజామాబాద్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఎంపీ అర్వింద్ చిట్ చాట్ గా మాట్లాడుతూ బీజేపీలో ఘర్ వాపసి నడుస్తోంది అన్నారు. బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని అన్నారు. బీజేపీలో పోటీ ఎక్కువగా ఉంటుందని, పార్లమెంటు ఎన్నికల కోసం పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉన్నారు అన్నారు. మూడో సారి కూడా కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని మోడీ మూడోసారి ప్రధాని కానున్నారు అన్నారు. దేశ వ్యాప్తంగా బీజేపీకి 68 శాతం ఓట్లున్నాయని,

ఉత్తర భారత దేశంలో కాంగ్రెస్ కు ఒక్క పార్లమెంటు సీటు కూడా రాదు అన్నారు. నిజామాబాద్ పార్లమెంట్ ఫరిధిలో 5 లక్షల ఓట్లు లక్ష్యంగా ఎన్నికలలో పోరాడుతామని అన్నారు. నిజామాబాద్ లో ఎంపీగా పోటీ చేస్తామని సవాల్ చేసిన కల్వకుంట్ల కవిత కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. ఆమెనే పార్లమెంట్ ఎన్నికలలో పోటీ చేయాలని పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసనలకు దిగాలని సూచించారు. అసెంబ్లి ఎన్నికల తరువాత కవిత పార్టీ క్యాడర్ ను వదిలేశారని అన్నారు. నిజామాబాద్ పార్లమెంటులో 5 లక్షల స్వయం సహాయక సంఘాలకు కోట్లాది రూపాయల రుణాలు ఇచ్చినామని, 7 లక్షల పైన ఆయుష్మాన్ భారత్ కార్డులిచ్చాము అని గుర్తు చేశారు.

మహిళా సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఇవ్వటం లేదు అన్నారు. నిజామాబాద్ మార్కెట్లో పసుపు రేటు నిన్న క్వింటాళ్ రూ. 13999 గా ఉందని, భవిష్యత్తులో మరింత పెరుగుతుందని దాదాపు 20 వేలకు తగ్గకుండా ధర రావడం ఖాయమన్నారు. గత రెండేళ్లుగా పసుపు రైతులకు మేలు చేసేలా స్పైసీస్ బోర్డు, పసుపు బోర్డు పని చేస్తోండగా కేంద్రం పసుపు ఎగుమతులు పెంచటం ద్వారా రైతులకు మంచి ధరలు వస్తున్నాయి అన్నారు. ప్రధాని మోడీ చొరవతో పసుపు రైతులకు మేలు చేకూరనుందని అన్నారు. ఈ సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ, బల్ధియా ఫ్లోర్ లీడర్ స్రవంతి రెడ్డి, నాయకులు పోతనకర్ లక్ష్మి నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Read Disha E-paper

Next Story

Most Viewed