- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
పరాయి వాళ్ళ పెత్తనం మనకెందుకు : బీజేపీ అభ్యర్థి ధన్ పాల్ సూర్యనారాయణ
దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ నగరంపై పరాయి వ్యక్తుల పెత్తనం మనకెందుకని బీజేపీ అభ్యర్థి ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. సోమవారం నగరంలోని 38 వ డివిజన్ లోని అరుంధతి నగర్ కాలోని దుబ్బ నుంచి బీజేపీ అభ్యర్థి దన్ పాల్ సూర్యనారాయణ ఇంటి ఇంటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నగరం లో బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు లోకల్ వారు కాదన్నారు. నగరం లో అభివృద్ధి శూన్యమని అన్నారు. నగరంలో తాను ఎన్నో సంవత్సరాల నుండి ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ కార్యక్రమాలు చేస్తూ ఎన్నో దేవాలయాల అభివృద్ధి కి సహకరించానని అన్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు పేదలకు అందుతున్నాయ న్నారు. రాష్ట్రంలో అవినీతి తారాస్థాయి కి చేరిందన్నారు.
కుటుంబ పాలనా పోవాలంటే బీజేపీ కి మద్దతు ఇచ్చి భారీ మెజారిటీ తో గెలిపించాలన్నారు. మీలో ఒకడిగా ఉంటూ మీ కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటానన్నారు నగరంలో ఏన్నో సమస్యలు పేరుకుపోయాయని, 2014 లో డబుల్ బెడ్ రూమ్ లు అందచేస్తామని చెప్పి ఒక్కటి కూడా ఇవ్వలేదన్నారు. పేదవారి సమస్యలను ఇక్కడి బీఆర్ఎస్ అభ్యర్థి ఏనాడూ పట్టించుకోలేదని అన్నారు. బీజేపీ మేనిఫెస్టో వచ్చాక ప్రజలంతా సంతోషంగా ఉన్నారు.
ఈసారి బీజేపీ అభ్యర్థులని గెలిపిస్తామనే నమ్మకం ప్రజల్లో కల్గింది అన్నారు. 10సంవత్సరాల పాలనలో నిరుద్యోగ సమస్యలు పట్టించుకోలేదని అన్నారు. బీజేపీ ప్రభుత్వం గల్లీ నుంచి ఢిల్లీ వరకు జెండా ఎగరేస్తుంది అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్తులు టూరిస్ట్ నాయకులన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గడ్డం రాజు, శ్రీరామ్, కొండా ఆశన్న, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గోపిడి స్రవంతి రెడ్డి, అసంబ్లీ కన్వీనర్ పంచారెడ్డి లింగం, కరిపే గణేష్, బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.