- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పైసలిస్తే దీవెనలు.. ఇయ్యకుంటే శాపాలు..
దిశ, కొత్తూరు : పసిపిల్లలతో భిక్షాటన చేస్తే కఠిన చర్యలు తప్పవు అన్న అధికారుల మాటలు నీటి మీద రాతలు గా మారాయని పలువురు విమర్శిస్తున్నారు. ఎందుకంటే నెలల వయసు గల పసిపిల్లలతో భిక్షాటన చేస్తూ పలువురు మహిళలు సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వారు అడగగానే డబ్బులు ఇస్తే ఒకలా.. డబ్బులు ఇవ్వకుంటే ఇంకొకల మాటలంటూ జబర్దస్తీ చేస్తుండడంతో ఇలాంటి వారిపై చర్యలు తీసుకునే వారే లేరా అని ప్రశ్నిస్తున్నారు. పసిపిల్లలను బలవంతం గా ఏడిపిస్తూ భిక్షమెత్తుకునే ఈ విష సంస్కృతి ఒకప్పుడు హైదరాబాద్‌లో కనిపించేది. ప్రస్తుతం మండల కేంద్రం లో వై జంక్షన్‌కు అతి సమీపంలో ఉన్న పలు హోటల్స్ వద్ద పసి పిల్లలను చంకనేసుకొని హోటల్స్ వద్ద భోజనం కోసం వాహనాలు ఆపిన వారి దగ్గర భిక్షమెత్తుకుంటున్న మహిళలు పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నారు. నెలల వయ సున్న పిల్లలను చంకనేసుకుని పిల్లలను బలవంతంగా ఏడిపిస్తూ భిక్షాటన కొనసాగిస్తున్నారు. ఇంకా కొందరు మహి ళలు పిల్లలకు భిక్షాటన నేర్పిస్తున్నారని అక్కడి హోటల్ నిర్వాహకులు చెబుతున్నారు. ఇప్పటికైనా బాలల సంరక్షణ యూనిట్ అధికారులు స్పందించి పిల్ల లను రక్షించాలని పలువురు కోరుతున్నారు.
మండల కేంద్రంలో బెగ్గింగ్ మాఫియా..?
రూపాయి పెట్టుబడి లేకుండానే రూ.లక్షల్లో సంపాదన వచ్చే మార్గాల్లో బెగ్గింగ్ మాఫియా కూడా ఒకటి. కొం తమంది తమ స్వార్థం కోసం ముసలి వాళ్లను, పిల్లలను, ఆడవాళ్ల చేతికి పసి పిల్లలను ఇచ్చి భిక్షం ఎత్తుకునేలా చేస్తుంటారు. వారిని రోడ్లపై అడుక్కునేలా చేసి ఆ డబ్బుతో లక్షల రూపాయలు గడిస్తుంటారు. అలాంటి బెగ్గింగ్ మాఫియా కొత్తూరు మండల కేంద్రంలో భిక్షాటన దందా మొదలు పె ట్టిందేమో అనే అనుమానాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ మధ్య పదుల సంఖ్యలో మహిళలు, వృద్ధులు కొత్తూరు మండల కేంద్రంలో భిక్షమెత్తుతూ కనిపిస్తున్నారు.
బాల రక్షక్ వాహనాల గురించి తెలుసా...
ఆపదలో ఉన్న బాలల రక్షణ కోసం గత ప్రభుత్వం 2022లో 1098 హెల్ప్ లైన్‌ను ఏర్పాటు చేసి, జిల్లాకు ఒకటి చొప్పున సీఎస్‌ఆర్ నిధులతో బాల రక్షక్ వాహనాలను కేటాయించింది. అనాథ బాలలు, 18 ఏండ్ల లోపు పిల్లలు భిక్షాటన చేసినా, బాల్య వివాహం జరుగుతున్నా 1098 హెల్ప్‌లైన్‌కు కాల్ చేయాలని తెలిపింది. హెల్ప్ లైన్‌కు కాల్ వచ్చిన వెంటనే ప్రొటెక్షన్ ఆఫీసర్, జిల్లా బాలల సంరక్షణ యూ నిట్ అధికారులు కలిసి బాల రక్షక్ వా హనంతో సంఘటనా స్థలానికి చేరుకుని వారిని రక్షిస్తారు. బాల సదనంకు చేర్చి వారికి వసతి, భోజన సౌకర్యం కల్పిస్తారు. అలాగే పరిస్థితులను బట్టి పోలీసు, రెవెన్యూ తదితర సంబంధిత శాఖల అధికారుల సహకారం కూడా తీసుకుంటారు. మహిళా శిశు సంక్షేమ శాఖ పర్యవేక్షణలో బాల రక్షక్ వాహ నాలు నిర్వహించబడతాయి.